రెండు పార్టీలు కలిసి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేయాలని డిసైడ్ చేశాయి. అధికార వైసిపికి గట్టి పోటి ఇవ్వాలని డిసైడ్ చేయటమే విచిత్రంగా ఉంది. లెక్కల్లో 1+1= 2 అన్న విషయం అందరికీ తెలిసిందే.  కానీ రాజకీయాల్లో 1+1= 2 అవుతుందని అనుకునేందుకు లేదు సున్నా కూడా కావచ్చు.  కాకపోతే రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేనలు కలిసినందు వల్ల 2 అవుతుందా లేకపోతే సున్నా అవుతుందా చూడాలి.

 

నిజానికి రాష్ట్రానికి సంబంధించినంత వరకు మొన్నటి ఎన్నికల్లో   బిజెపికన్నా జనసేనకు వచ్చిన ఓట్లు ఎక్కువన్న విషయం గమనించాలి. బిజెపికి 0.84 శాతం ఓట్లు వస్తే జనసేనకు సుమారు 5 శాతం ఓట్లు వచ్చాయి. అయితే జనసేనకు వచ్చిన ఓట్లు కేవలం గాలి వాటమే అన్న విషయం గమనించాలి. జనసేనకు వచ్చిన ఓట్లలో  కొంతమంది కాపు సామాజికవర్గం ఓట్లు మిగిలినవి అభిమానుల ఓట్లు వచ్చాయంతే కానీ మామూలు జనాల వేసిన ఓట్లు తక్కువనే చెప్పాలి.

 

ఇక్కడ జనసేనతో ఉన్న సమస్యేమిటంటే ఏ స్ధాయిలో కూడా అసలు పార్టీ నిర్మాణమే జరగలేదు. ఏదో గాలివాటంగా నెట్టుకొచ్చేస్తున్నాడు పవన్ . కానీ బిజెపికి గ్రామస్ధాయి నుండి రాష్ట్రస్ధాయి వరకూ పార్టీ నిర్మాణం ఉంది. ఎక్కడికక్కడ పార్టీ తరపున కమిలున్నాయి. కాకపోతే జనాల్లో ఆధరణ లేదు. కేంద్రంలో అధికారంలో ఉందని చెప్పుకుని రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని నేతలు చూస్తున్నారంతే.

 

మొత్తం మీద  రాష్ట్రంలో రెండు పార్టీల పరిస్ధితి దాదాపు ఒకేలాగుంది. దానికి తోడు రెండు పార్టీల నేతల మధ్య కావాల్సినంత గ్యాప్ ఉంది. పవన్ ఏమో రాష్ట్రస్ధాయి నేతలను బైపాస్ చేసి కేంద్రంలోని నేతలతో టచ్ లో ఉంటున్నాడు. దీంతో రాష్ట్ర నేతల్లో చాలామంది పవన్ పై మండిపోతున్నారు. ఇటువంటి నేపధ్యంలో జరగబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని, వైసిపికి గట్టి పోటి ఇస్తామని రెండు పార్టీల నేతలు ప్రకటించటమే పెద్ద జొక్ గా తయారైంది. అసలు ఇంతకీ పవన్ ప్రచారానికి టైం కేటాయిస్తారా ? అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా తయారైంది.

 

                                                                                                                                                      

 

మరింత సమాచారం తెలుసుకోండి: