కులాంతర వివాహం చేసుకుందని కన్న కూతురు గర్భవతి అని తెలిసి కూడా ఆమె భర్తను చంపించేందుకు ఇతర రాష్ట్రానికి చెందిన కిల్లర్ కి సుపారీ ఇచ్చి మరి కూతురు చూస్తుండగానే చంపించిన మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతిరావు హైదరాబాద్ లోని ఓ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన మరణించే ముందు తన కూతురుకి క్షమాపణలు చెప్పినట్లు.. ఆమె తన తల్లివద్దకు చేరుకోవాలిని సూచించినట్లు.. ఆయన భార్యకు కూడా క్షమాపణలు చెప్పినట్లు నోట్ లో రాసిన సారాంశం.  ఇదిలా ఉంటే మారుతిరావు మరణం తర్వాత ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  ఆయన కూతురు తనకు జరిగిన అన్యాయానికి కనీసం తండ్రి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదే.. అంటూ వార్తలు వచ్చాయి. 

 

తాాజాగా తను తన తండ్రిని కడసారిగా చూడాలని అనుకుంటున్నానని, అందుకు పోలీసుల సహకారం కావాలని నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు కుమార్తె అమృత కోరింది.  ఆమె మిర్యాలగూడ అధికారులకు సమాచారాన్ని పంపింది. అయితే తన తండ్రికి తనకు మద్య సంవత్సరం నుంచి అభిప్రాయ భేదాలు వచ్చాయని.. ఈ విషయం సోషల్ మీడియాలో సైతం భారీగానే ఫోకస్ అయ్యిందని.. ఈ నేపథ్యంలో ఆయనను ఇష్టపడేవారు తనపై దాడి చేసే ప్రమాదం ఉందని ఆమె భావిస్తుంది.

 

తన తండ్రిని చూడాలని అక్కడికి వెళితే, తనపై దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాలని ఆమె కోరడంతో పోలీసులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అమృత కోరికను ఆమె బంధువులకు, కుటుంబ సభ్యులకు తెలియజేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. మరోవైపు తన తండ్రి అంత్యక్రియలకు అమృత రావడం పై తల్లికి ఇష్టం లేనట్టు తెలుస్తుంది. తన కుటుంబం ఇలా కావడానికి కారణం అమృతేనన్న ఆగ్రహంతో ఆమె ఉన్నట్టు కొందరు బంధువులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమృత వచ్చేందుకు ఆమె బాబాయ్ నిరాకరించాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: