స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా మద్యం షాపులను మూసేయాలని డిసైడ్ అయ్యారట. ఈనెల మొత్తం స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణలో మొత్తం యంత్రాంగం బిజీగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా ఎన్నికలంటే మందుబాబులకు, మద్యం వ్యాపారులకు పెద్ద పండగనే చెప్పాలి.

 

అలాంటిది ఈనెల 12వ తేదీ నుండి 29వ తేదీ వరకూ రాష్ట్రంలోని మద్యం షాపులన్నింటినీ మూసేస్తేనే మంచిదని జగన్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చాడట. మద్యం అమ్మటం, కొనటం వల్ల అనేక సమస్యలు వస్తాయన్న ముందు జాగ్రత్తతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుందనే వాదన కూడా ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాలు జగన్ తో చెబుతున్నాయట. అంటే ఫైనల్ డెసిషన్ జగన్ దే అనుకోండి అది వేరే సంగతి.

 

మద్యం షాపులు మూసేస్తేనే మేలని జగన్ ఒకవైపు మూసేస్తే ఆదాయం పడిపోతుందని యంత్రాంగం మరోవైపు చెబుతున్న అభ్యంతరాల వల్ల నిర్ణయం ఇంకా అధికారికం కాలేదని సమాచారం. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దశలవారీగా మద్య నియంత్రణ చేస్తానని ఎన్నికల సమయంలోనే జనాలకు హామీ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇచ్చిన మాటకు కట్టుబడే షాపులను, బార్లను తగ్గించేస్తున్నాడు.

 

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని షాపులను మూసేస్తే సుమారు 3500 షాపులు దాదాపు రెండు వారాలు మూత పడిపోతాయి. ఎన్నికల్లో ఎక్కడా  మద్యం పంపిణీ చేయకూడదనే చట్టం తెచ్చిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడట జగన్.  మొత్తానికి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాల మీద సంచలనాలవుతున్నాయి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: