కొన్ని కొన్ని సార్లు జరిగే సంఘటనలు అసలు నమ్మలేకుండా ఉంటాయి. ఆధునిక సమాజంలో కూడా... జరిగే కొన్ని సంఘటనలు కళ్ళతో చూసిన నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ ఇలాంటిదే జరిగింది. ఇక్కడ ఆ ఇంట్లో ఓ కుర్చీ ఉంది. అది మామూలు కుర్చీ  కాదు. అది ఒక డెత్ చైర్.  ఇలాంటివి మనం సినిమాలలోనే చూస్తూ ఉంటాం. ఏదైనా కుర్చీలో తెలియని శక్తి ఉండడం... అందులో కూర్చున్న వారు చనిపోతే ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడున్న కుర్చీ మాత్రం హారర్ సినిమా కంటే భయపెట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కుర్చీలో కూర్చున్న వారు ఇప్పటి వరకూ ఎవ్వరూ ప్రాణాలతో లేరు. కుర్చీలో కూర్చుంటే ప్రాణాలు పోవడం ఏమిటి... ఇదంతా ట్రాష్.. అని వేళాకోళం చేసిన వ్యక్తులు కూడా ఘోరమైన చావును కొనితెచ్చుకున్నారు. 

 


 ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజంగా జరిగిన ఘటనే. అందుకే అందరూ దీన్ని డెత్ చైర్ గా  పిలుస్తూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి ఈ కూర్చుని ఎంతో ప్రాణంగా చూసుకునే వాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ వ్యక్తి చనిపోయాక... ఆ కుర్చీ ఇతరుల ప్రాణం తీయడం మొదలు పెట్టింది. అయితే ఈ కుర్చీలో కూర్చోవడం వలన లేదా ఈ కుర్చీని హేళన చేయడం వలన ఇప్పటి వరకూ చనిపోయింది ఒక్కరు ఇద్దరు అనుకుంటే పొరపాటే. కొన్ని దశాబ్దాలుగా ఏకంగా రెండు వందల మంది ఈ కుర్చీ వల్ల చనిపోయారు అంటే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టక మానదు. మొదట్లో ఆ మరణాలు ఎలా జరిగిందో ఎవరికీ అర్థం అయ్యేది కాదు. కానీ కాలక్రమేణా అసలు విషయం అందరికీ తెలిసిపోయింది. అది సాధారణ కుర్చీ కాదని ఆ కుర్చీ ఒక వ్యక్తి ఆత్మ అని.. అక్కడి ప్రజలు తెలుసుకున్నారు. 

 


 ఇలాంటి మనుషుల ప్రాణాలు తీసే కుర్చి ఇంట్లో ఉండటం మంచిది కాదు అని భావించి ఏకంగా ఆ కూర్చుని ఓ మ్యూజియానికి అప్పగించారు. ఇక మ్యూజియంలో కూడా ఆ కుర్చీలో ఎవరైనా కూర్చుని ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు అనే భయంతో ఆ కూర్చుని గోడకు వేలాడదీశారూ. ఇంగ్లాండ్ లోని నార్త్ యార్క్ షైర్ లోని త్రీస్క్  ప్రాంతంలో బస్సే  అనే వ్యక్తి ఓ కేసులో ఉరిశిక్ష పడగా... ఇక అతని చివరి క్షణంలో ఈ కుర్చీలో కూర్చొని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆ వ్యక్తిని ఉరి తీశారు. ఇక ఈ కూర్చుని ఆ హోటల్ వారు ఎంతో ఫేమస్ చేశారు. ఇలా చాలా మంది వచ్చి కుర్చీలో కూర్చొగా ఆ సంతోషం ఎన్ని రోజులు నిలిచేది కాదు. కుర్చీలో కూర్చున్న వ్యక్తులు వేర్వేరు కారణాలతో చనిపోయేవారు. కానీ కొన్నాళ్ళకు అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ కుర్చీలు నేలపై ఉంచితే ఎవరైనా కూర్చునే  ప్రమాదం ఉందని ఈ కూర్చుని గోడకు తగిలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: