ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు  వాడి వేడిగా  జరుగుతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. అంతేకాదు ప్రస్తుతం రాజ్యసభ స్థానాలకు గాను జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీ మధ్య పోటీ నెలకొనిన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టిడిపి పోటీ చేయాలని నిర్ణయించింది. టిడిపి పార్టీ తరఫున సీనియర్ నేత ఆర్టీసీ మాజీ ఛైర్మన్ వర్ల రామయ్య బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

 

 

 అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తాము గెలిచే అవకాశం లేదు అంటూ తిలిసిన  చంద్రబాబు తమ  అభ్యర్థిని బరిలోకి దింపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలను తెలియజేసేందుకు.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. సంఖ్యా పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో అధికార వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి . అధికార వైసీపీ పార్టీ  నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను... ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని , పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పోటీ చేస్తారని అధికార వైసిపి పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభకు ఈ నలుగురు ఎంపిక కావడం దాదాపు లాంఛనమే అని చెప్పవచ్చు. 

 

 

 ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి కూడా రాజుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచి పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా అధికార వైసిపి పార్టీ ప్రతిపక్ష టిడిపి పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: