ఆ చైనా వారికి మితిమీరిన తెలివితేటలు ఉండటం వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం సమస్యల్లో చిక్కుకుంది.. చైనా సృష్టించిన వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల్లో ఉన్న అందమైన పర్యాటక ప్రదేశాలు అన్ని శ్మశానాలను తలపిస్తున్నాయి.. ఒక్క పర్యాటకుడు కూడా విదేశాల సందర్శనం చేయడం లేదు.. ఇదే కాకుండా ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్దమీద కూడా ఈ ప్రభావం భయంకరంగా పడింది..

 

 

ఇకపోతే ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు ముప్పును వాటిల్ల చేసే అంటు రోగంగా కరోనా రూపాంతరం చెందింది.. అయితే ప్రపంచాన్ని 2009లో ఒక్కసారిగా వణికించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇక చివరికి ఎలాగోల ఈ వ్యాధినుండి బయటపడ్డామని ఊపిరి పీల్చుకుని బ్రతుకుతుండగా పనిపాట లేనొడు పిల్లితల కొరిగిండనే మాదిరిగా చైనా వాడు ఈ కరోనా వైరస్‌ను అంటించి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వానికి పని కల్పించాడు. ఇక ప్రస్తుతం ఈ వ్యాధిని నివారించడానికి ఇంకా వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి సమర్థమైన చికిత్సలు కానీ అందుబాటులోకి రానందున దీని వ్యాప్తిని అరికట్టలేక పోతున్నారు..

 

 

అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్యవిషయం ఏంటంటే కరోనా భయంకరంగా ప్రపంచదేశాలను చుట్టేయడానికి కారణం మనిషిలో ఉన్న భయం అని అంటున్నారు.. ఇదెలా అంటే.. ఐసోలేటెడ్ సమస్యనట.. మొదటగా చైనాలో ఈ వ్యాధి ప్రబలినప్పుడు వ్యాధి వచ్చిన వాడిని కంట్రోల్ చేస్తే సరిపోయేది. ఆ ఒక్కడి నుండి ఈ రోగం క్రమక్రమంగా చైనా అంతటా వ్యాపించిందట.. అయితే ఈ వ్యాధి వచ్చిన వాడు ఒక్కడే ఉంటే వాన్ని ఎవరితో కలవకుండా ఒంటరిగా బంధించడం వల్ల వాడి మానసిన స్దితి దెబ్బతిని భయంతో వణికిపోతున్నాడట..

 

 

ఈ భయం ఉండటం వల్ల, తనకు తోడుగా మరో నలుగురు ఉంటే బాగుండుననే స్వార్ధంతో అతనికి వచ్చిన రోగాన్ని దాచి ఏమి తెలియని వానిలా ప్రజల్లో తిరగడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగిపోయిందట.. మరి మనుషులు స్వార్ధపరులంటారు గానీ ఇంత స్వార్ధంకూడా పనిచేయదు సామీ అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: