2014లో జనసేన పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటినీ ఎదిరించి నిలబడి ప్రజల కోసం ముందుకు సాగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పదవి లేకపోయినా పర్వాలేదు ప్రజల కోసం పోరాడుతా అంటూ చెబుతున్నారు. పదవీ ఉన్న ప్రతిపక్ష నాయకులు సైతం  అధికార పార్టీని ఎదిరించలేక పోతుంటే ఎలాంటి పదవి లేకుండానే అధికార పార్టీని బెదిరిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నేటితో  ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.  దీంతో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో జనసేన ముఖ్య నేతలందరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 సినిమాల్లోకి వస్తే తన స్థాయి ఎంతో తక్కువగా ఉంటుంది అని ఎంతోమంది అన్నారని... కానీ వాళ్ళందరూ అన్నది  మాత్రం పట్టించుకోకుండా సినిమాల్లోకి వచ్చి తన స్థాయి ఏంటో నిరూపించుకున్నాను  అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. 2014లో పార్టీని ప్రారంభించామని.. ఈరోజు ఏడో  ఏడాది లోకి అడుగుపెడుతున్నామని... ఈ సందర్భంగా అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను....అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.  సినిమాల్లోకి రాకముందు  నన్ను కొంతమంది హేళన చేశారు... నా మొహానికి 70 లక్షలతో మాత్రమే సినిమా తీయొచ్చు...నా  సినిమాకి కోటి రూపాయలు పెడితే అదే మహా గొప్ప అన్నారు. కానీ ఓ వ్యక్తి స్థాయి  ఇంతే అని నేను ఎప్పుడూ నమ్మను.. ఒకవేళ నన్ను విమర్శించిన వాళ్ళ మాటలు నమ్మి నా స్థాయి అంతేనేమో అనే నిరాశ చెంది అక్కడే ఆగిపోయి ఉంటే... ఇంత మంది అభిమానాన్ని సొంతం చేసుకునే వాడిని కాదు... వాళ్ల మాటలు నిజమే అని నమ్మే ఉంటే ఈ స్థాయికి వచ్చే వాడిని కాదు అంటూ పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు.

 

 

 భగవంతుడు నాకిచ్చిన జీవితంలో... నాకు ఉన్న శక్తిసామర్ధ్యాలను పూర్తిగా ఉపయోగించుకుని... నేను ఏదైనా పని చేస్తాను అంటూ పవన్ కల్యాణ్ తెలిపారు. ఇప్పటివరకూ తాను చేసిన అన్ని పనులను సంపూర్ణంగానే పూర్తిచేశాను అంటూ తెలిపారు. సినిమాలను  అంతే సంపూర్ణంగా పని చేశారు అంటూ చెప్పుకొచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ప్రతికూల పవనాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో అడుగు పెట్టాను అంటూ తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... తాను పదవుల కోసం ఆశించే వాడిని కాదని.. ప్రజల క్షేమం కోసం మాత్రమే ఆశించిన వాడిని అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: