బుర్రలేనివారు డబ్బులు సంపాదించడం కోసం నానా సంకలు నాకుతుంటే, బుర్ర ఉన్నవారు మాత్రం మోసాలు చేసి లక్షలు లక్షలు దోచేస్తున్నారు.. ఒక రకంగా నిజాయితీగా బ్రతకాలనుకునే వారికి లోకంలో విలువ ఉండటం లేదు.. అదే మోసగాడు మాత్రం ఎప్పుడు దర్జాగానే బ్రతుకుతాడు.. అది ఎప్పటి వరకు అంటే అతను దొరికే వరకు.. అతని దొంగతనం బయట పడేవరకు.. ఇక ఈ మధ్యకాలంలో అమ్మాయిల అందాన్ని వలగా వేసి మగాళ్ల వీక్‌నెస్‌తో ఆడుకుంటున్న మోసగాళ్లు చాలానే తయారు అవుతున్నారు.. తాము సంపాదించుకున్న ప్రావీణ్యాన్ని అడ్డదారుల్లో ప్రయాణించడానికి ఉపయోగిస్తున్నారు..

 

 

ఇలాగే ఒక యువకుడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. అదెలా అంటే డేటింగ్ యాప్ ‘టిండర్’ను ఆయుధంగా వాడి ఓ సీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి లక్షలు వసూలు చేసి చివరకు కటకటాలపాలైయ్యాడు.. ఇన్ స్టాగ్రామ్ నుంచి యువతుల ఫొటోలు అప్ లోడ్ చేసి, వాటితో టిండర్ యాప్ లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి దాని ఆధారంగా సెక్స్ చాట్ న్యూడ్ ఫొటోలు పంపుతానంటూ అబ్బాయిల వద్ద లక్షలు వసూలు చేయడం మొదలుపెట్టాడట.. అలా అతని మోసానికి గురైన వారు ఈ విషయం ఎక్కడైన చెబితే పరువు పోతుందని భావించి సైలెంట్ గా ఉన్నారు.. అయితే ఇతని వల్ల పెళ్లి ఆగిపోయిన ఓ యువతి తన ఫొటోను టిండర్ డేటింగ్ యాప్ లో చూసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ నేరగాడి బండారం మొత్తం బయటపడింది..

 

 

ఇకపోతే ఉన్నత చదువులు చదువుకున్న యువత ఇలా పెడదారిన పట్టడం సమాజానికే కాదు.. వారిని కన్నవాళ్లకు కూడా ప్రమాద కరంగా మారుతున్నారు.. కుటుంబం పరువును బజారుపాలు చేస్తున్నారు.. మంచిపనులకు వాడుకోవలసిన టెక్నాలజీని ఇలాంటి చెడుపనులకు వినియోగిస్తున్నారు.. ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఉన్న వారు ఉగ్రవాదుల చేతికి చిక్కితే ఎన్నో దారుణాలకు తెరలేచినట్లు అవుతుంది.. వీరికి డబ్బు ఆశచూపి వీరితోనే మన సమాజన్ని, మనదేశాన్ని ప్రమాదంలో పడవేసే అవకాశాలున్నాయి.. కాబట్టి ఇలాంటి వారి వియంలో చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది అని ఈ సంఘటన తెలియచేస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: