త్వరలో  ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది. అయితే ఇప్పటికే జడ్పిటిసి ఎంపీటీసీలు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియగా ఇందులో అధికార పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు . అయితే టీడీపీ పోటీ పోటీ చేయకపోవడంతో వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు అని వైసిపి నాయకులు చెబుతున్నారు. కాని దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 75 శాతం సీట్లు వైసీపీ కి  ఏకగ్రీవమయ్యాయి. అలాగే డోన్ లాంటి చోట కూడా మేము వైసీపీ కి  నజరానాగా చేస్తున్నామంటూ ఏకంగా మాజీ ఉప ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి నెలకొంది. 

 

 అయితే ఆంధ్ర ప్రదేశ్ స్థానిక ఎన్నికలు జరుగుతున్న ఏకగ్రీవాలు ప్రేమతో జరిగినవి కాదని భయంతో అయోమయంతో జరిగిన ఏకగ్రీవాలు అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఏకగ్రీవాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల అన్నప్పుడు రెండు పార్టీల నుంచి ఇద్దరు  అభ్యర్థులు నిలబడితే ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు అనేది డిసైడ్ చేస్తారు. అయితే మామూలుగా ఎన్నికల్లో ప్రలోబాలనే  తప్పు పడుతూ ఉంటారు.  అలాంటిది ప్రస్తుతం వైసీపీ బయోత్పాతం  సృష్టిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేకులు. 

 

 ప్రత్యర్థుల వీక్నెస్ ని బేస్ చేసుకొని దాని మీద ఫోకస్ చేసి ప్రత్యర్థులను భయాందోళనకు గురి చేసి.. వారిని  పోటీ చేయకుండా చేసి అయిన ఏకగ్రీవాలు  ఇప్పుడు జరుగుతున్నాయి అని  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్వచ్ఛందంగా ఎవరూ ఏకగ్రీవం చేయలేదని.. భయోత్పాతం తోనే ఏకగ్రీవం అయ్యాయి  అంటున్నారు. అయితే గతంలో కేవలం ప్రలోభాలకు గురి చేస్తేనే  ప్రజలు టిడిపి పార్టీకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు వైసీపీ గురి చేయడం కాదు ఏకంగా భయోత్పాతం కి  గురిచేస్తుంది. మరి రాబోయే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: