ఒకానొక సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా టీవీ 9 చానల్ వార్తలు ప్రసారం చేసేదని ముద్ర ఉండేది. యాజమాన్యంలో రవి ప్రకాష్ ఉన్న టైంలో పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా టీవీ 9 చానల్ ప్రసారం చేసేదని తరువాత యాజమాన్యంలో రవి ప్రకాష్ వెళ్లిపోయిన తర్వాత ప్రస్తుతం వైసిపి కి అనుకూలంగా వార్తలు రాస్తున్నట్లు కథనాలు ప్రసారం చేస్తున్నట్లు ఏపీ మీడియా రంగంలో వార్తలు గట్టిగా వినపడుతున్నాయి.  ఒక విధంగా చెప్పాలంటే జగన్ కి సాక్షి తరువాత బాగా పల్లకీ మోసే ఛానల్ గా టీవీ 9 ప్రస్తుతం వ్యవహరిస్తుందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు మరియు కథనాలు ప్రచారం చేస్తోందని ఇటీవల టీడీపీకి చెందిన నాయకులు ఆ చానల్ పై మండిపడుతున్నారు.

 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం మంట కలిపే విధంగా టీవీ 9 వ్యవహరిస్తుందని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు విమర్శలు మీద విమర్శలు చేస్తున్నారు. దీంతో చాలా వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సాక్షి టీవీతో పాటు ఇటీవల టీవీ 9 చానల్ కి సంబంధించిన మీడియా ప్రతినిధులను ఇటీవల టిడిపి పార్టీ నాయకులు ఆహ్వానించ కూడదని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా సదరు ఛానల్ లో చర్చలకు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధులు వెళ్లకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం.

 

మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం టీవీ 9 ఛానల్ వైసిపి పార్టీ కనుసన్నల్లో నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీవీ9కి ప్రజల్లో ఉన్న క్రెడిబులిటీని పణంగా పెట్టి మరీ…పూర్తిగా టీడీపీని టార్గెట్ ఫేక్ న్యూస్ కూడా ప్రసారం చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఐటీ దాడులు.. పార్టీ ఫిరాయింపులు వంటి వాటిలో టీవీ9 తప్పుడు వార్తలు ప్రచారం చేసిందని అలా చేయడం వెనకాల వైసిపి పార్టీ పెద్దల హస్తం ఉందని టిడిపికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ టీవీ9 ఛానల్ ని తమ కార్యక్రమాలకు సంబంధించి కవరేజ్ విషయంలో బహిష్కరించడానికి రెడీ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: