ఇప్పటివరకు అధికారికంగా ఏ రాష్ట్రప్రభుత్వం తాము కరోనా వైరస్‌ను కనుగొన్నామని ప్రకటించలేదు.. ఒక రాష్ట్రాలే కాదు.. ప్రపంచ దేశాలు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.. కాని కొందరు మాత్రం కరోనాకు మందు దొరికింది.. ఇక హాయిగా బ్రతకవచ్చు లాంటి వార్తలను విపరీతంగా ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.. ఒక వేళ నిజంగా కరోనాకు మందే ఉంటే.. ప్రపంచంలో ఎందరో దారుణంగా మరణిస్తున్నారు మరి అలాంటి వారిని చావునుండి బ్రతికించవచ్చు కదా.. అదిమాత్రం చేయరు..

 

 

ఇకపోతే ఈ కరోనాను అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సెంటిస్టులు రాత్రిపగలు కష్టపడుతున్నారు.. కంటికి కనిపించకుండా వీరు పడే తపన అంతా ఇంత కాదు.. ఇందులో భాగంగా రూపొందించిన ఓ టీకా(వ్యాక్సిన్‌)ను నేడు తొలిసారి ప్రయోగించనున్నట్లు అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. సోమవారం ఓ వ్యక్తిపై క్లినికల్‌ ట్రయల్స్ ప్రారంభించనున్నామని చెబుతుండగా, ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీనికి సంబంధించి సియాటెల్‌లోని వాషింగ్టన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు జరగుతున్నాయని తెలుస్తుంది... కాగా ఈ వ్యాక్సిన్‌ పనితీరును పూర్తిస్థాయిలో ఆమోదించడానికి మాత్రం మరో 18 నెలలు వేచిచూడక తప్పదని అక్కడి పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు పేర్కొంటున్నారు..

 

 

ఇకపోతే 45 మంది యువకులు ఈ ప్రయోగానికి ముందుకు వచ్చారు.. వీరంత  ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాలు పంచుకోవడానికి సాహసించిన వారు.. వీరందరిని విడివిడిగా చేసి ఒక్కొక్కరికి ఒక్కో పరిమాణంలో వ్యాక్సిన్‌ను ఇస్తారు.. అయితే, ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, మరిన్ని లోతైన పరీక్షలు చేయడానికి ముందు చేసే ప్రయోగం మాత్రమే ఇదని వైద్యులు తెలిపారు.

 

 

ఇక ఇప్పటికే కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు వివిధ పద్ధతులను అవలంబిస్తుండగా, ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని చేస్తున్న ‘షాట్స్‌’ తరహా వ్యాక్సిన్లను వేగంగా ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, ఇది ఇచ్చే ఫలితాలు కూడా ఇదివరకటి వ్యాక్సిన్ల కంటే మెరుగ్గా ఉంటాయని వీరు వెల్లడించారు. సో దీనిబట్టి అర్ధం అయ్యేది ఏంటంటే కరోనా వైరస్‌కు మందు రావాలంటే ఇంకా సమయం ఉందని తెలుస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: