ఇప్పటి వరకు భూమిపై ఎన్నో రకాల వైరస్ లు వచ్చాయి.. వాటిలో కొన్నింటికి యాంటీ డోస్ కనుగొన్నారు.  వాటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎవరూ కంగారు పడలేదు. కానీ  చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది.  ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 1,45,631 మందికి చేరింది. ముఖ్యంగా ఇటలీలో పరిస్థితి తీవ్రంగా ఉంది. భారత దేశంలో కరోనా ఎఫెక్ట్ తో ఇద్దరు మృతి చెందారు. అయితే కరోనా వల్ల పెను ప్రమాదాలు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ప్రతి ఒక్కరూ భయంతోనే బతుకుతున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటిని మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలో కూడా స్కూల్స్, కాలేజీలు, బార్లు, ఇతర పర్యాటక కేంద్రాలను కూడా కొంత కాలం మూసి వేస్తున్నారు.  తాజాగా  తమిళనాడు రాష్ట్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు బంద్ చేయాలని, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, జూపార్క్ లు, క్లబ్బులు, బార్ లు, రిసార్ట్స్ మూసివేయాలని నిర్ణయించింది.

 

ఈ మేరకు సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు.  అయితే కరోనా కు సంబంధించి ఇక్కడ పెద్దగా వార్తలు ఏమీ రావడం లేదు.. ముందు జాగ్రత్త చర్యలు మాత్రం తీసుకుంటున్నారు. తమిళనాట సినిమాలపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు.  మొత్తానికి ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వాణిజ్య వ్యవస్థ పై కూడా తీవ్ర నష్టాన్ని చూపిస్తుంది.  భారత దేశంలో ఇప్పటికే ఇండస్ట్రీకి రూ. 500 కోట్ల నష్టం వాటిల్లబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: