ప్రపంచాన్ని షేక్ చేసి పడేస్తున్నా కరోనా వైరస్ నీ అరికట్టడానికి ప్రయోగాలు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు అంతర్జాతీయ స్థాయిలో లెక్కలు చెబుతున్నాయి. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ గా ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. భారతదేశంలో కూడా వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కేంద్ర వైద్యశాఖ అలర్ట్ అయింది. ఇదే నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉండ బోతున్నట్టు వార్తలు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యా సంస్థలను బంద్ చేయడం అదేవిధంగా సినిమా హాల్లో మరియు షూటింగులు ఆపేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

 

పెళ్ళిళ్ళు మరియు అదే విధంగా ఫంక్షన్లు విషయంలో కూడా కొన్ని రూల్స్ ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే వ్యాధి యొక్క ప్రభావం తక్కువ ఉన్నాగాని ఇతర దేశాల నుండి వచ్చే వాళ్ల వల్ల ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంటున్న నేపథ్యంలో జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులు ఇంటికి చేరుకోగానే రెండు వారాల పాటు బయటకు రాకూడదు అని కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పట్టించుకోకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తే వెంటనే బయట కనబడిన మరుక్షణం సదరు వ్యక్తిని జైలుకు పంపించే విధంగా వారిపై కేసులు నమోదు చేయాలని జగన్ ప్రభుత్వం ఇటీవల ఆదేశించడం జరిగింది. దీంతో ఈ వార్త ఇప్పుడు ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: