ప్రపంచంలో మనిషి తన జీవన విధానానికి అనుకూలంగా మార్పులు చేసుకుంటూ అభివృద్ధి దిశలో ప్రయాణిస్తున్నాడు.. కాని ఆపదలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా రూపాంతరం చెంది  మనిషిని ప్రశ్నిస్తూనే ఉన్నాయి.. ప్రకృతిలో భాగం మనిషి.. ఇది నియమం.. కానీ ఇప్పుడు మనిషిలో భాగం ప్రకృతిని చేసి ప్రపంచంలోని పచ్చదనాన్ని తన అభివృద్ధికి బలి చేసాడు.. ఫలితంగా ఎన్నో విపత్తులు, రకరకాల వ్యాధులు.. ఎంతగా అంటే ప్రకృతిని కాదని జీవిస్తున్న మనిషి, మరణానికి దగ్గర అవుతున్నాడు.. పెను ప్రమాదాలను పక్కలోనే పెట్టుకుని ఉంటున్న, తనకేమి కాదు అనే ధీమాలో బ్రతుకుతున్నాడు.. అందుకే అప్పుడప్పుడు కరోనా లాంటి రోగాలు వచ్చి మనిషి వైపల్యాన్ని గుర్తుచేస్తున్నాయి..

 

 

ఇకపోతే లోకంలో పుట్టే ప్రతి వైరస్ ప్రమాదకరమైనదే.. దేన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.. ఇలాంటి మహమ్మారిని గుర్తించి అవగాహన పెంచుకునేలోపునే వేలాది మంది ప్రాణాలు కోల్పోతారు. ఆ మధ్య వచ్చిన ఎబోలా కావచ్చు. నిన్న వచ్చిన నిఫా కావచ్చు. మధ్య మధ్యలో జనాన్ని వణికించిన స్వైన్​ ఫ్లూ లాంటివి, లేటెస్ట్​గా వచ్చిన కరోనా కావచ్చు. ఇలా వచ్చే ఏదైనా యమ డేంజరే. ఇకపోతే ప్రపంచాన్ని వణికించిన కొన్ని ప్రమాదకర వైరస్​ల గురించి తెలుసుకుంటే.. 1720 లో ప్లేగు.. 1820లో కలరా.. 1920 లో ఫ్లూ.. 2020లో కరోనా.. ఇవే గాక  2013 నుంచి 2016 వరకు ఆఫ్రికా వణికించిన వ్యాధి ఎబోలా.. ఈ వైరస్​ను 1976లో సౌత్ సూడాన్​లోని జారా అనే ఒక పట్టణంలో గుర్తించారు. ఇక మూడు నాలుగేళ్ల క్రితం ఎబోలా వైరస్​ పేరు చెబితే ప్రపంచం భయంతో వణికిపోయింది..

 

 

తర్వాత ప్రజలను మృత్యురూపంలో కబళించిన వ్యాధి డెంగీ.. ఈ వైరస్​ ప్రభావం మన దేశంలో 2016లో బాగా ఎక్కువగా పడింది. దీని బారిన న్యూఢిల్లీ, కేరళలో దాదాపు 1500 మంది పడగా, బంగ్లాదేశ్​లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయట.. ఒకరకంగా డెంగీ జ్వరాలు సోకని రాష్ట్రం లేనే లేదు. ఇక 1970కు ముందు డెంగీ వైరస్ కేవలం తొమ్మిది దేశాలలోనే ఉండేది. అయితే, ఆ తరువాత ఈ వైరస్ వంద దేశాల్లో విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.. ఇక చికున్ గున్యా.. ఇది కీళ్ల నొప్పుల రూపంలో మనుషులను ముప్ప తిప్పలు పెట్టింది.. 2013–2017 మధ్య కాలంలో ఇండియాలో 70 శాతం మేర చికున్​గున్యా సోకింది. ఈ వ్యాధిని మొట్టమొదటి సారి 1953 లో టాంజానియాలో గుర్తించారు. ఆ తర్వాత 2017లో జికా వైరస్​ మన దేశాన్ని తాకింది. దీన్ని  1947లో ఉగాండాలో తొలిసారి గుర్తించారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 86 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది..

 

 

ఇకపొతే జంతువుల నుండి మనుషులకు వ్యాపించిన వ్యాధి ఆంత్రాక్స్.. 2007లో ఛత్తీస్​గఢ్​లో దీనిని గుర్తించారు. ఇక రెండేళ్ల క్రితం కేరళను కుదిపేసిన ‘నిఫా’ ఈ వైరస్​ మలేసియా, సింగపూర్​లలో వందలాది మందిని బలి తీసుకుంది. 2001వ సంవత్సరంలో బంగ్లాదేశ్​లోకి, అక్కడినుంచి పశ్చిమ బెంగాల్​లోకి ప్రవేశించింది. 2018లో కేరళను కుదిపేసింది. మలేసియాలో 1999లో నిఫా వైరస్​ను తొలిసారి గుర్తించారు. తర్వాత రేబిస్.. ఇలా ప్రతిసారి ఎన్నో ప్రమాదకరమైన వైరస్‌లు ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తూనే ఉన్నాయి.. ఇవే కాకుండా చిన్నాచితక వైరస్‌లు అప్పుడప్పుడు ప్రజల మీద దండయాత్ర చేస్తూనే ఉన్నాయి.. ప్రపంచంలో మనిషి రోజు రోజుకు ఉన్నతిని సాధిస్తున్నాడే గాని ఎప్పటికప్పుడు ప్రకృతి ముందు ఓడిపోతున్నాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: