ప్రపంచమంతా ఇప్పుడు కరోనా పేరు వినగానే ఉలిక్కిపడుతోంది. చైనాలో మొదలైన ఈ భయంకరమైన వైరస్ అతి తక్కువ కాలంలో ప్రపంచమంతా విస్తరించిపోయింది. ఇప్పటికే అనేక దేశాలు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నాయి. భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 128 కేసులు నమోదయ్యాయి. దారుణం ఏంటంటే ఈ ఒక్కరోజే ఏకంగా తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి.. ఇంకా మరిన్ని కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు ఆనుమాణిస్తున్నారు.  కరోనాని అరికట్టమే తప్ప దీనికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. మన దేశం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఇప్పటి వరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయిన కరోనా లక్ష 70వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 6వేల 526మంది చనిపోయారు.

 

ఇక తెలంగాణలో నాలుగో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణాలో కరోనా సోకిన వారి నంబర్ నాలుగుకు చేరింది. ప్రస్తుతం అ వ్యక్తి సికింద్రాబాద్ గాంధీలో చికిత్స పొందుతున్నాడు.  ఇక మహారాష్ట్రలో తొలి కరోనా మృతి సంబవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిని కూడా సీరియస్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారత్ లో ఈ కరోనా విస్తరించడానికి ముఖ్య కారణం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే అని అంటున్నారు.  వారి సంచరించిన ప్రదేశాల్లో కరోనా వైరస్ ప్రబలిపోవడం వల్ల ఈ వైరస్ వివిధ ప్రదేశాల్లో ప్రభావం చూపుతూ వచ్చిందని అంటున్నారు.  

 

ఇటలీ, ఇరాన్, స్పెయిన్ లో ఒక్కసారిగా కరోనా విజృంభించడం కలకలం రేపుతోంది. కరోనా వ్యాప్తితో దేశంలో అన్ని రాష్ట్రాలు అలర్ట్‌ అవుతున్నాయ్‌. స్కూళ్లకు, సినిమా హాల్స్‌, పార్క్‌లు, స్విమింగ్‌ఫూల్స్‌ మూసివేయాలని అధికారులను ఆదేశించాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఇదొక వైరస్.. విస్తరిస్తూనే ఉంటుందని.. సాధ్యమైనంత వరకు డాక్లర్లు ఇస్తున్న సూచనలు పాటించాలని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: