భారత దేశంలో  కరోనా వైరస్ రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ కరోనా  వైరస్ ప్రభావం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో రోజురోజుకు కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తెస్తోంది. తాజాగా దేశం షెడ్ డౌన్  దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే దేశంలో ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా  ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఏకంగా 39 కరుణ పాజిటివ్ కేసులు నమోదవ్వగా... 200 మంది కరోనా అనుమానితులు  అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 

 

 

 కరోనా  వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తెస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండటంతో భారత్ షట్ డౌన్   దిశగా భారత ప్రభుత్వం ఆలోచన చేసింది. విద్యా సంస్థలకు  ఇప్పటికే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పార్కులు మైదానాలు క్లబ్బులు సినిమా థియేటర్లు... షాపింగ్ మాల్స్.. ఇలా పూర్తిగా మూసివేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్  నుంచి వచ్చేవారికి 14 రోజుల పాటు క్వారంటైన్ లో  సిరికొండ చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టర్కీ, ఐరోపా, బ్రిటన్ నుంచి ఎవరిని భారత్ కి అనుమతించ వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

 

 

 భారత దేశంలో రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ఈ కఠిన ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు పరిస్థితిని కేంద్ర బృందం సమీక్షిస్తుంది. కరోనా  వైరస్ ను నివారించేందుకు రోజు రోజుకు మరింత కఠిన నిబంధనలు అమలు తెస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికే వందకు పైగా కరోనా  కేసులు  భారత్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక చాలామంది అబ్జర్వేషన్లో కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: