హిందుత్వ వాది బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పుడు ప్రభుత్వం తీరును ఎండగట్టడంలో  ముందు ఉంటారు అన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై  కేసిఆర్ సర్కార్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఉంటారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇక తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే రాజాసింగ్. టిఆర్ఎస్ పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ తో కలిసి రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేస్తుంది అంటూ  ఆరోపించారు ఎమ్మెల్యే రాజేసింది. తెలంగాణను  బంగారు తెలంగాణగా మారుస్తా అంటూ  చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... బంగారు తెలంగాణ కాదు కదా మద్యం తెలంగాణ అప్పుల తెలంగాణ గా మారుస్తున్నారు అంటూ విమర్శించారు. 

 

 

 అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడడానికి సమయం ఇచ్చే దమ్ము ఉందా అంటూ కేసిఆర్ ను ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. రంగులు మార్చే ఊసరవెల్లి... మాట మార్చే కేసిఆర్ కు పోటీ పెడితే ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధిస్తారు అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల మాట్లాడకుండా అధికార పార్టీ గొంతు నొక్కేస్తుంది అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో జరుగుతున్న డ్రామా  మొత్తం ప్రజలు చూస్తున్నారని టిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారు అంటూ విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను కెసిఆర్ మోసం చేశారని విమర్శించారు. సొంత రాష్ట్రంలో భైంసా లో జరిగిన హింసాత్మక ఘటనలు కేసీఆర్ లు  గుర్తు లేవు కానీ.. ఢిల్లీలో జరిగిన అల్లర్లు  మాత్రం ఎలా గుర్తున్నాయి అంటూ ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసీఆర్ ప్రశ్నించారు. 

 

 

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివినట్టు చెప్పుకుంటున్నారు.. అలాంటి వ్యక్తి పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి పది పేజీలు చదవలేదా.. అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశంలోనే ఒక వర్గానికి కూడా ఇబ్బంది కలగదు అంటూ స్పష్టం చేశారు రాజాసింగ్. కేసిఆర్ సర్కార్ పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. పౌరసత్వ  సవరణ చట్టం వల్ల ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే తాను తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి మరి వెళ్ళిపోతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: