ప్రపంచంలో ఏ ముహూర్తంలో కరోనా వైరస్ చొరబడిందో కానీ.. మనిషిన చూసి మరో మనిషి భయపడే పరిస్థితికి వచ్చింది.  ముఖ్యంగా కరోనా వల్ల ఇతరులకు ఇట్టే ఈ వ్యాధి సోకుతుందన్న భ్రమతో ఈ మద్య విదేశాల నుంచి వచ్చి ఓ వృద్ద జంటను అపార్ట్ మెంట్ లోకి రానివ్వని పరిస్థితి హైదరాబాద్ లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  కరోనా వచ్చిన వారికి  సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  అయితే భారత్ లో ఎక్కువగా ఈ కరోనా విదేశాల నుంచి వచ్చినవారికే సోకిన విషయం తెలిసిందే. దాంతో బయట దేశాల నుంచి వచ్చిన వారిని ఎంతో అనుమానంతో చూస్తున్నారు.. వారికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులను ఎప్పటికప్పుడు పరీక్షించి అనుమానం ఉంటె క్వారంటైన్ కు లక్షణాలు ఉంటె హాస్పిటల్ కు లేదంటే 14 రోజులపాటు సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  

 

ఒకవేళ వారు బయట తిరిగితే ఎంతో ప్రమాదం అని హెచ్చరిస్తూనే ఉన్నారు. కరోసా సోకిన వ్యక్తులను గుర్తించడం కష్టంగా మారడంతో విదేశాల నుంచి ఎయిర్ పోర్ట్ లో దిగిన వ్యక్తుల చేతులపై ఓ ముద్ర వేస్తున్నది. ఆరోజు నుంచి 14 రోజులపాటు బయటకు రాకూడదు అని పేర్కొంటూ ముద్ర వేస్తుంది.  ఈ మద్యనే జర్మనీ నుంచి ముంబై వచ్చిన నలుగురు వ్యక్తులు చేతులపై ముద్ర వేయించుకుని సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు.  అయితే, ఇంట్లో ఉండకుండా ఆ నలుగురు ముంబై నుంచి గరీబ్ రధ్ రైల్లో గుజరాత్ లోని సూరత్ కు బయలుదేరారట.

 

వారి చేతిపై ముద్ర ఉండటాన్ని గమనించిన ప్రయాణీకులు వారిని ప్రశ్నించారు... పిచ్చి సమాధాన చెప్పడంతో వెంటనే చైన్ లాగి అధికారులకు జరిగిన విషయం చెప్పడంతో నలుగురిని అక్కడికి దగ్గర ఉన్న స్టేషన్ లో దించేశారు.  అక్కడే కరోనా టెస్టులు చేసి రోడ్డు మార్గం ద్వారా వారిని తిరిగి పంపించేశారు. ఒకవేళ వారు అలాగే ప్రయాణించి ఉంటే కరోనా ప్రబలి ఉండేది.. పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: