ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అరికట్టడం కోసం భారత ప్రధాని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్ వల్ల చాలామంది ప్రజలు మృత్యువాత పడ్డారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ఇటలీలో విజృంభించిన ఈ విషయం అందరికీ తెలిసినదే. అక్కడ ప్రభుత్వాలు ప్రజలకు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా గాని వినకపోవడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అరికట్టడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం యావత్ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. మార్చి 22వ తారీకు నుండి ఎవరు కూడా బయటకు తిరగకూడదు ఆ రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని దీని ద్వారా వైరస్ అరికట్టవచ్చని తెలిపారు.

 

ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు మరియు అన్ని కూడా ఇంటికే పంపిస్తామని మోడీ చెప్పుకొచ్చాడు. చాలావరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ వైరస్ అరికట్టాలంటే కచ్చితంగా ప్రజలు ఇంటికే పరిమితం కావాలని శుభ్రం పాటించాలని కనబడని శత్రువుతో మనం పోరాటం చేస్తున్నామని మోడీ ప్రసంగించడం జరిగింది. అయితే కేవలం వైరస్ గురించి మాట్లాడిన మోడీ ఈ పాయింట్ మిస్సయ్యారు అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

 

అదేమిటంటే ప్రధాని మోడీ దేశ ఆర్థికవ్యవస్థ గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. కానీ రెండు నెలల పాటు దేశంలో కరోనా పాతకుపోయి వుంటే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్భాభిన్నం అవుతుంది. అది వాస్తవం. మొదటి ప్రపంచయుద్దం లాంటి పరిస్థితులు అని మోడీ వెనుక వైనం ఇదే కావచ్చు.  రోజువారీ కార్మిక వ్యవస్థ ఈ రెండు నెలలు కుప్పకూలుతుంది. వారిని ఆదుకోవాల్సి వుంది. దీంతో మోడీ నిర్ణయం వల్ల చాలా వరకు ఆర్థిక మాంద్యం దేశంలో ఏర్పడుతుందని చాలామంది అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: