ప్రస్తుతం అంతా భయం.. భయం.. దేశంలో  ఎక్కడ చూసిన కరోనా  వైరస్ భయం స్పష్టంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తే ప్రజలందరిలో ప్రాణ భయం కలిగిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో... కరోనా  విజృంభణ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో కరోనా  ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి వళ్ళ ఈ కరోనా  ప్రభావం పెరిగిపోయింది. ఇక తెలంగాణలో కరోనా  వైరస్ బారిన పడిన వారిలో తెలంగాణ వాసుల కంటే విదేశాల నుంచి వచ్చిన వారే మరింతగా కనిపిస్తోన్నారు. దీంతో రోజురోజుకీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. 

 

 

 దీంతో తెలంగాణ ప్రజలందరూ తీవ్ర భయాందోళన నెలకొంటుంది. అయితే అటు కేంద్ర ప్రభుత్వం కూడా దేశ ప్రజలందరూ అని అప్రమత్తం కావాలని సూచిస్తుంది... ఇక ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చే ప్రజలందరినీ ఇంటికే పరిమితం అయ్యేలా చేస్తుండడంతో... మరింత భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇకపోతే రోజురోజుకు కరోనా వైరస్  తెలంగాణ రాష్ట్రంలో కోరలు చాస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ... జన సంచారం ఉన్న అన్ని ప్రదేశాలను మూసేస్తూ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కరోనా  వైరస్ విజృంభన మాత్రం ఆగడం లేదు. 

 

 

 నిన్న తెలంగాణ రాష్ట్రంలో రెండు కరోనా  పాజిటివ్ కేసులు నమోదవగా... ఈ రోజు మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో  కోరలు చాస్తున్న కరోనా  బారిన పడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఈ నేపథ్యంలో ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య 20కి దాటిపోయింది. రోజురోజుకు కరోనా వైరస్ విజృంభణ పెరుగుతుండడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రోజు రోజు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలని  అమలు చేసే  అవకాశం కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: