ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మయం..అందరిలో  ప్రాణభయం... ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిస్తూ... అందరికీ ప్రాణ భయం కలిగిస్తు... విలయ తాండవం చేస్తుంది మహమ్మారి కరోనా  వైరస్. ప్రస్తుతం ఈ మాట చెబితే చాలు ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవానికి ఎంతోమంది బలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా పది వేల మంది వరకు ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిపోయినా ప్రపంచ దేశాలు కరోనా వైరస్ నియంత్రించేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి . మొన్నటి వరకు చైనా దేశంలో మరణ మృదంగం మోగించిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం చైనా దేశంలో తగ్గుముఖం పట్టినప్పటికీ ఇతర దేశాల్లో మాత్రం విజృంభిస్తోంది. 

 

 

 

 ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణ నష్టం జరిగిపోతుంది. అయితే ఈ వైరస్ కి ఇప్పటివరకు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో... ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ మరింత భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు స్వీయ దిగ్బంధం లోకి వెళ్ళి పోతున్నాయి. క్రమక్రమంగా ఎన్నో కఠిన ఆంక్షలు తమ దేశంలో అమలు చేస్తున్నాయి. కరోనా  వైరస్ ను నియంత్రించి జయించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే కరోనా  వైరస్ నియంత్రణకు ప్రపంచదేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలి అని సూచిస్తుంది ఐక్యరాజ్యసమితి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన భారీ ప్రాణ నష్టం తప్పదు అంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటేరన్  హెచ్చరించారు.

 

 

 ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దావానంలా వ్యాపిస్తున్న ప్రాణాంతకమైన కరోనా  వైరస్ పట్ల... కొంచమైనా అలసత్వం ప్రదర్శించినా పరిస్థితి కాస్త చేయి దాటిపోయి లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునే  అవకాశం ఉంది అని చెబుతోంది ఐక్యరాజ్యసమితి. అయితే చనిపోయిన వారి గురించి బాధపడడమే  కాకుండా ప్రపంచ దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూ కరోనా వైరస్ ను  ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నట్టు తెలిపింది. అయితే కరోనా  ప్రభావం లేని దేశాలు కూడా ముందుకు వచ్చి కరోనా  ప్రభావం ఉన్న దేశాలను ఆదుకోవాలంటూ సూచించింది. అయితే ఇలా పరస్పరం సహకరించుకోకుండా  ఆయా దేశాల అప్రమత్తంగా ఉండకపోతే  మాత్రం భారీ ప్రాణ నష్టం తప్పదు అంటూ సూచిస్తుంది ఐక్యరాజ్యసమితి.

మరింత సమాచారం తెలుసుకోండి: