ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ భూమి మీద ఉన్న ఇప్పుడు అన్ని ఖండాలలో వ్యాపించి ఉంది. అయితే ఇటలీ దేశంలో ఎక్కువగా దీని ప్రభావం ఉంది. ముఖ్యంగా ఇటలీ దేశ అధికారులు మరియు ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు పాటించక పోవడం వల్లే ఆ దేశంలో చాలా దారుణంగా వైరస్ బాగా ప్రబలినట్లు వార్తలు వస్తున్నాయి. ఓల్డ్ మరియు కాలేజీలు అదేవిధంగా ప్రజలెవరూ వీధుల్లోకి రాకూడదని చెప్పినా గాని ఆ దేశ ప్రజలు సరిగ్గా లెక్క చేయక పోవడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏకంగా ఇటీవల ఒక్కరోజులోనే 630 గానే వైరస్ వల్ల ఆ దేశంలో ప్రజలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇదే విధంగా ఇండియాలో కూడా రోజురోజుకి వైరస్ పెరుగుతోంది.

 

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలో మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు కొన్ని సూచనలు జాగ్రత్తలు చెబుతున్నా వినకుండా ప్రజలు చేస్తున్న ఈ పనుల వలన వైరస్ వ్యాప్తి చాలా స్పీడుగా స్ప్రెడ్ అవుతున్నట్లు ఇటీవల పరిశీలనలో తేలింది. పూర్తి విషయంలోకి వెళ్తే కొంత మంది విదేశాల నుంచి నేరుగా వారి ఇళ్ళకు వెళ్ళిపోయారు. చెకింగ్ లేని విమానాశ్రాయాల నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక యువత అమెరికాలో ఉంటుంది.

 

ఆమె ఇటీవల అమెరికా నుంచి వచ్చేసింది. ఆమె ఉండే గదిలో ముగ్గురుకి కరోనా సోకింది. ఇక్కడికి వచ్చిన పది రోజులకు ఆమె వ్యాధి బయటపడింది. గన్నవరం విమానాశ్రయంలో దిగి ఆమె ఇంటికి వెళ్ళింది. అక్కడ చెకింగ్ లేదు. ఆమెకు ఇప్పుడు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆమె ఇంట్లో ఎంత మందికి సోకిందో తెలియదు. ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి చర్యలతో జనాలను చంపుతున్నారు కొందరు.ఇటువంటి తప్పుల వల్ల చాలామంది రాష్ట్రంలో సామాన్యులు బలైపోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: