ప్రస్తుతం రోజురోజుకు భారతదేశం మొత్తం కరోనా  వైరస్ కోరల్లో కొంచెం కొంచెంగా చిక్కుకుంటున్న  విషయం తెలిసిందే. ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా 250కి పైగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత ప్రజలందరూ ప్రాణభయంతో వణుకుకుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తెరమీదికి తెచ్చి అమలు చేస్తున్నప్పటికీ కూడా కరోనా  వైరస్ వ్యాప్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రోజురోజుకీ కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య  పెరిగిపోతున్నది . ఈ నేపథ్యంలో భారత దేశంలో రోజురోజుకీ డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. ఇక ఈ వైరస్కు సరైన వాక్సిన్  కూడా లేకపోవడంతో ప్రజలందరూ మరింత భయాందోళనకు గురవుతున్నారు.

 

 

 అయితే తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో నిన్న జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్న అన్ని నిబంధనలను పాటించాలి అని తెలిపారు. అలా పాటించినట్లయితే కరోనా  పై విజయం సాధించగలమని తెలిపారు. అంతేకాకుండా కరోనాను   పారదోలేందుకు మార్చి 22వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ  కి అందరు సహకరించాలని... కోరారు. ఇక దీనిపై స్పందిస్తున్న సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటిస్తూ తమ అభిమానులకు కూడా జనత కర్ఫ్యూ  పాటించాలని సూచిస్తున్నారు. 

 

 

 అయితే  తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ పై  ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ గళం కలిపాడు. నమస్తే ఇండియా అంతా ఒక్కటై  కరోనా వైరస్ పై పోరాటం చేద్దాం... ఇంట్లో ఉండి నిబంధనలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును పాటిద్దాం  అంటూ పీటర్సన్  సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే పీటర్సన్ పోస్ట్ కి బదులు ఇచ్చిన నరేంద్ర మోడీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో జట్లను  చూసిన విధ్వంసకర బ్యాట్స్మెన్ పీటర్సన్ భారత శ్రేయస్సుకోసం స్పందించారు అంటూ ప్రధాని మోదీ రిప్లై ఇచ్చారు. దీనికి బదులుగా థాంక్యూ మోడీ జీ మీ నాయకత్వం కూడా విధ్వంసమే కదా అంటూ పీటర్ సన్ తెలిపాడు. ప్రస్తుతము ఇది  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: