కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణ భయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ మహమ్మారి వైరస్ చైనా దేశంలో గుర్తించబడింది. చైనాలోనివుహాన్  నగరంలో ఈ మహమ్మారి వైరస్ గుర్తించబడింది. డాక్టర్ లీ  అనే వ్యక్తి మొదట కరోనా వైరస్ గుర్తించాడు. ఇక ప్రస్తుతం అతను కూడా  కరోనా వైరస్ బారిన పడి చనిపోయాడు. అయితే ప్రస్తుతం దీనిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. చైనా దేశం పథకం ప్రకారమే కరోనా  వైరస్ వ్యాప్తి చెందేలా చేసిందని కొన్ని కథనాలు వస్తుంటే.. డాక్టర్ లీ  వైరస్ గురించి చెప్పిన కానీ అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుతం ప్రపంచం ఈ వైరస్ బారినపడి వనికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని రెండు రకాల కథనాలు ప్రచురితం అవుతున్నాయి. 

 

 హుబ్లీ ప్రావిన్స్లోని హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న లీ కి  పెళ్లై ఒక కొడుకు ఉండగా ప్రస్తుతం అతని భార్య గర్భవతి. అయితే ఓ రోజు లీ  దగ్గరికి ఏడుగురు పేషెంట్ రాగా వారిని  పరీక్షించిన డాక్టర్లు.. కరోనా  వైరస్ గురించి కనుగొన్నాడు. కరోనా  వైరస్ కారణంగా ఎంతో  మంది చనిపోతారు అని అప్పుడే ఊహించాడు డాక్టర్ లీ . తన స్నేహితులతో సోషల్ మీడియా వేదికగా పంచుకొని రిపోర్టులను కూడా షేర్ చేశాడు. ఆ తర్వాత ఈ రిపోర్టులు కాస్త  సోషల్ మీడియా లో వైరల్  కావడంతో అసత్య ప్రచారాలు చేస్తున్నాదు డాక్టర్ లీ ని పోలీసులు  అరెస్టు చేశారు. ఆ తర్వాత వాంగ్మూలం తీసుకొని వదిలిపెట్టాడు. 

 


 అలా పేషెంట్లకు చికిత్స చేస్తూ డాక్టర్ లీ కి  కూడా కరోనా వైరస్ సోకింది. అప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతను మరణించాడు. డాక్టర్ లీ  చెప్పింది నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆపదలో పడిపోయిందని చాలామంది చైనా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కెనడా నుంచి వైరస్ ను  తీసుకొచ్చి హుబి  ప్రావిన్స్ లోని ఒక మార్కెట్లో కరోనా  వ్యాధి సోకే విధంగా చైనా ప్లాన్ చేసిందని... ఈ వైరస్ వ్యాప్తి జరగక ముందు నుంచే ఈ వైరస్కు విరుగుడు కనిపెట్టేందుకు చైనా ప్రయత్నాలు మొదలుపెట్టిందని.. . ప్రపంచ వినాశనానికి చైనా ప్రయత్నం చేసింది అని కొందరు విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: