కరోనా వైరస్ ను  తరిమికొట్టేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ అంటూ భారత ప్రజలందరికీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం7 గంటల నుండి రాత్రి  9:00 వరకు జనతా కర్ఫ్యూ  పాటించాలి అంటూ  ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందడుగు వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా 14 గంటలు మాత్రమే జనతా కర్ఫ్యూ  నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు నిర్వహించాలి అంటూ ఓ ముందడుగు వేశారు. ఇక తాజాగా కరోనా  వైరస్ వ్యాప్తి పై మీడియా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణలో కరోనా  వైరస్ వ్యాప్తి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాదు మార్చి 31 వరకు తెలంగాణలో జనతా కర్ఫ్యూ విధించాలి  అని అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా నిర్ణయించారు. 

 

మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం చేస్తూ లాక్ డౌన్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ వారం రోజుల పాటు అన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించాలంటూ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక సామాన్య ప్రజలకు ఒక్కొక్కరికి 12 కిలోల  రేషన్ బియ్యం తో పాటు 1500 రూపాయలు డబ్బులు కూడా అందజేస్తామని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కలిసి కరోనా  వైరస్ పై  పోరాడాల్సిన అవసరం ఉంది అంటూ ఈ సందర్భంగా తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకవేళ కరోనా వైరస్ ను  నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుతం ఇటలీ  దేశం ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలంగాణ కూడా ఎదుర్కోవలసి వస్తుంది అంటూ తెలిపారు. 

 

 కరోనా  వైరస్ పై  ఈరోజు ఇటలీ స్వీయ నియంత్రణ చేయకపోవడంతో పరిస్థితి రోజురోజుకు చేయి దాటిపోతుందని అన్నారు . ఇటలీ దేశం లో ఏకంగా రోజుకి 700 మంది వరకు చనిపోతున్నారు అంటూ గుర్తు చేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కూడా రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో... రాష్ట్ర ప్రజలందరూ సహకరించి కరోనా వైరస్ ను తరిమి కొడతాం అంటూ పిలుపునిచ్చారు. ఇటలీ కి  పట్టిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి పట్టకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది అంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: