మీరు మనుషులు అయితే ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు పాటించండి.. అలా కాదు అని రోడ్ల మీదకు వచ్చి ప్రాణాలను పోగొట్టకండి. మనుషుల్లా ప్రవర్తించండి.. కేవలం వారం అంటే వారం రోజులు ఇంట్లో ఉండండి.. జాగ్రత్తలు పాటించండి.. పరి శుభ్రంగా ఉండండి.. దేశాన్ని.. ప్రపంచాన్ని కాపాడండి. 

 

IHG

 

ప్రభుత్వ సూచనలు పాటించి బాధ్యత ఉన్న పౌరులు అని నిరూపించుకోండి. అలా కాదు అని బాధ్యత లేకుండా వ్యవహరించి దేశాన్ని రోగాల పాలు చెయ్యకండి. మీకు పనులు ఆగిపోతే కేవలం ఒక 10 రోజులు ఆగిపోతాయి అంతే.. ప్రభుత్వ సూచనలు పాటించకుండా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. 

 

IHG

 

కేవలం అంటే కేవలం వారం రోజులు ఇంట్లో ఉందాం.. కుటుంబంతో సంతోషంగా గడుపుదాం.. ఇంట్లో ఉన్న సరే ఒకటికి రెండు సార్లు సబ్బుతో చేతులు కడుక్కుందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. వ్యాధి నిరోధక శక్తిని పెరిగే ఆహారాన్ని తీసుకోండి.. వీలైనంత వరుకు ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.. బయట ఆహారాన్ని అసలు తీసుకోకండి. 

 

IHG

 

జాగ్రత్తలు పాటించండి.. కేవలం అంటే కేవలం ఒక్క వారం రోజులు అంతే.. కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయి.. ఇంట్లో భార్యతో.. పిల్లలతో ఆనందంగా గడపండి.. ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావు. గుర్తు పెట్టుకోండి. వారం నియంత్రణకు సహకరిద్దాం.. జాగ్రత్తలు పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం. 

 

IHG

 

మీరు అలా కాదు అని బయటకు వచ్చారు అంటే గుర్తుపెట్టుకోండి.. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 13 వేలమంది మృతి చెందారు. 3 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.. ఇంకా పడుతూనే ఉన్నారు. అందుకే ముందే జాగ్రత్తలు తీసుకొంది.. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తలు పాటించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: