భూమి మీద ఉన్న ప్రజలను కరోనా వైరస్ గడగడలాడించి ధనవంతుల నుండి పేదవాడి వరకు అందరిని ఒకే దెబ్బకు ఇంటిలో కూర్చోబెట్టింది. నాకు అందరూ సమానమే అన్నట్టుగా భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో వ్యాపించి ఉంది. కోవిద్ 19 మహమ్మారి కి అభివృద్ధి చెందిన దేశాలు గజగజ లాడుతున్నయి. చైనా లో పుట్టిన ఈ వైరస్ దాదాపు 180 కి పైగా దేశాలలో విస్తరించి ఉంది. ఎక్కువగా ఇటలీలో తాసు పాము పడగ విప్పినటు, ఇటలీ దేశ ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఆ దేశంలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. కనీసం రోజుకి 1000 లోపు మరణాలు సంభవిస్తున్నాయి.

 

దీంతో ఆ దేశ ప్రెసిడెంట్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ... ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ప్రస్తుతం ఇటలీలో ప్రతీచోట వైరస్ వ్యాపించి ఉంది. ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రాకూడదని ఆ దేశం హెచ్చరికలు జారీ చేసింది. ఇదే తరుణంలో ఇండియాలో కూడా దేశ ప్రధాని మోడీ మార్చి 22 నుండి 31 వరకు దేశ ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపు ఇవ్వటం జరిగింది. దీంతో దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి.

 

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటువంటి టైములో ఐక్యరాజ్యసమితి మరో బాంబు పేల్చింది. అదేమిటంటే లాక్‌డౌన్లు విధించినంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేమని, తర్వాత సరైన ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ఈ లాక్‌డౌన్‌లే మరింత ప్రమాదకరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు వైరస్‌ బాధితులను వేగంగా గుర్తించాయని ఆ దేశాలను మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ వైరస్‌కు టీకా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: