కరోనా అనేది స్వాభిమానం ఉన్న రోగం. మనం ఆహ్వానిస్తేనే అది మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కరోనాను ఆహ్వానించకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కాని ఇప్పుడు కరోనా దెబ్బకు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్న ఇటలీ దీన్ని అన్ని విధాలుగా ఆహ్వానించింది. కరోనాకు యెర్ర తివాచి పరిచి మరీ ఆహ్వానం అందించింది అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ దేశం కరోనా దెబ్బకు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ఊహించని స్థాయిలో కరోనా వైరస్ ఇప్పుడు అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతుంది అనేది స్పష్టంగా అర్ధమవుతున్న వాస్తవం. 

 

అయితే ఇటలీ ఇప్పుడు చేతులు ఎత్తేసింది అంటున్నారు. నిన్న ఒక్క రోజు కరోనా వైరస్ ధాటికి వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ 53 వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయినా సరే ఆరు వేల మంది వరకు చనిపోయారు. ఈ స్థాయిలో కరోనా దెబ్బకు ఇబ్బంది పడుతున్న దేశం ఏదీ లేదు. చైనాలో 80 వేల మందికి పైగా కరోనా కేసులు నమోదు అయితే కేవలం చనిపోయింది మూడు వేల మంది మాత్రమే. కాని ఇటలీలో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

రోజు రోజుకి గుట్టలు గుట్టలు గా శవాలు పేరుకుపోయే పరిస్థితి అక్కడ నెలకొంది. కనీసం ఆ శవాలు తీయడానికి కూడా ఎవరూ ముందుకి రావడం లేదు అనేది వాస్తవం. ప్రజలు కూడా కరోనా వస్తే ఇక చచ్చిపోవడమే అనే భయంలోకి వెళ్ళిపోయారు. ఆ దేశ అధ్యక్షుడు కూడా మేం ఇంకా ఎవరిని కాపాడుకోలేము అని చెప్పినట్టు సమాచారం. మీడియా ముందుకి వచ్చి ఆయన కన్నీళ్లు పెట్టారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: