ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని కొన్ని చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎవరు ఎం పోస్ట్ చేస్తున్నారో ఎవరు ఎం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి సోషల్ మీడియాలో నెలకొంది అనేది వాస్తవం. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు చిగురుటాకు మాదిరి వణికిపోతుంది. అన్ని విధాలుగా కూడా కరోనా వైరస్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది. ఒకటి రెండు దేశాలు మినహా కరోనా వైరస్ ని కట్టడి చేయలేకపోతున్నాయి. రష్యా సహా కొన్ని దేశాలు అత్యంత కఠినం గా వ్యవహరిస్తున్నాయి. ఎలా అయినా సరే మా దేశంలో ఇది ప్రభావం చూపకూడదు అని పట్టుదలగా ఉన్నారు. 

 

ఒక పక్క అన్ని దేశాలు ఆ విధంగా పోరాటం చేస్తుంటే సోషల్ మీడియా మాత్రం అన్ని విధాలుగా ప్రజలను భయపెడుతూ పైశాచిక ఆనందం పొందుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న పోస్టులు చూస్తే పట్టుకుని ఎన్నాళ్ళు జైల్లో పెట్టినా తప్పు లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇటలీ అధ్యక్షుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఇటలీ అధ్యక్షుడు కానే కాదు. 

 

ఎవరో ఎక్కడో ఏడిస్తే ఇటలీ అధ్యక్షుడు ఏడుస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక అది పక్కన పెడితే... ఆయన ఫోటో తో పాటు మరికొన్ని కామెంట్లు జనాలు చేయడం గమనార్హం. ఆ అధ్యక్షుడు మాట్లాడుతూ మేము ఎవరిని కాపాడుకోలేము అని చెప్పెసారట. ఇక ఏది జరిగితే అదే జరుగుతుంది అని చెప్పారట ఆయన. మరి వీళ్ళకు వచ్చి చెవులో చెప్పారో ఏమో గాని ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో జనాలకు వినోదాన్ని అన్ని విధాలుగా అందిస్తున్నాయి. మరి పాపం ఇటలీ అధ్యక్షుడు ఎవరో ఎలా ఉంటారో వీళ్ళకు తెలుసో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: