ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల చైనా తర్వాత ఎక్కువ మరణాలు ఇటలీలో సంబవించాయనుకుంటే.. ఇప్పుడు చైనానే దాటిపోతుందా అని అంటున్నారు.  ఇటలీని కరోనా వైరస్​ ఊపిరితీసుకోనివ్వట్లేదు. రోజూ వేలాది మందికి అంటుతూ, వందలాది మంది ఉసురు తీసేస్తోంది. ఇంకా చెప్పాలంటే మరణాల్లో చైనాను దాటేసేంతలా ఇటలీని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది వైరస్​.  దేశాలు లాక్‌డౌన్ అవుతున్నా, ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా కల్లోలం మాత్రం ఆగడం లేదు. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 13వేలకు చేరింది. బాధితుల సంఖ్య మూడు లక్షలపైనే. ఇటలీలో ఆదివారం ఒక్క రోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,500కు పెరిగింది.  

 

వైరస్​కు కారణమైన చైనాలోనూ ఇంత వేగంగా కరోనా బాధితులు చనిపోలేదు. అక్కడ ఒక్కరోజులో హయ్యెస్ట్​ చనిపోయింది 150 మందే. ప్రపంచవ్యాప్తంగా 2,13,541 మందికి కరోనా వైరస్​ సోకింది. మొత్తంగా 8,790 మంది చనిపోయారు. ఒక్కరోజులో 817 మంది వైరస్​కు బలయ్యారు. చైనాలో చనిపోయిన వారి సంఖ్య 3,237కు చేరింది. కొత్త కేసుల సంఖ్య 13 కాగా, 11 మంది చనిపోయారు. ఇరాన్​లో ఒక్కరోజులో 147 మంది వైరస్​తో కన్నుమూశారు. స్పెయిన్‌లో తాజాగా మరణించిన 394 మందితో కలుపుకుని ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 1720కి చేరింది. అమెరికాలో లక్షలాదిమంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

 

న్యూయార్క్ సిటీ జైళ్లలో 38 మందికి కరోనా వైరస్ సోకింది. అమెరికాలో ఒక్క రోజులోనే కొత్తగా ఏడువేల కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 26,574కు చేరింది.  గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాని చైనాలో ఆదివారం తొలి కేసు నమోదైంది. కొత్తగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3261కి చేరుకుంది. శ్రీలంకలో కర్ఫ్యూను ఉల్లంఘించిన 340 మందిని అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: