కరోనా వైరస్ బాధితులుంటే వార్డులో డ్యూటి వేశారన్న కారణంతో ఇద్దరు డాక్టర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేయటం సంచలనంగా మారింది. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.   ఈ ఆసుపత్రిలోని రోగుల్లో కొరోనా వైరస్ బాధుతుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేసింది. ఈ వార్డులో రోగులకు వైద్యం అందించేందుకని ఆసుపత్రి వైద్యాధికారులు ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్ దంపతులు  టిర్కీ,  ఆయన భార్య సౌమ్య కు ఐసొలేషన్ వార్డులో డ్యూటి వేశారు.

 

వైద్యాధికారుల వైఖరికి వ్యతిరేకంగా దంపతులు ఇద్దరు తమ ఉద్యోగానికి రాజీనామాలు చేయటం సంచలనంగా మారింది.  తమ రాజీనామా లేఖల సమాచారంతో పాటు రాజీనామా లేఖలను కూడా వాళ్ళిద్దరూ వాట్సప్ లో సంబంధిత అధికారులకు పంపించారు. అయితే వీళ్ళ రాజీనామాలను అధికారులు తిరస్కరించారు. కొరోనా సమస్య ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో డ్యూటిలు వేశారన్న కారణంగా రాజీనామాలు చేయటం తగదంటూ అధికారులు అంటున్నారు. ముందొచ్చి డ్యూటిలు చేరాలంటూ ఇద్దరికీ నోటీసులిచ్చారు.

 

ఇదే విషయమై డాక్టర్ దంపతులు మాట్లాడుతూ ఐసొలేషన్ వార్డులో తమకు డ్యూటి వేశారని తాము రాజీనామాలు చేయలేదని చెబుతున్నారు. తన భార్య డాక్టర్ సౌమ్యకు అనారోగ్య సమస్యలున్నాయని టిర్కీ చెబుతున్నాడు. తన సోదరికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగటంతో తాను కూడా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఈయన చెప్పిన కారణాలను ఎవరూ  నమ్మటం లేదు. భార్యకు అనారోగ్యంగా ఉంటే ఇంతకు ముందే ఎందుకు రాజీనామా చేయలేదు ? అలాగే సోదరికి కిడ్నీ మార్పిడి జరిగితే టిర్కీ ఎందుకు రాజీనామా చేయాలి ?

 

వీళ్ళ రాజీనామాలను అధికారులు అంగీకరించలేదు. పైగా 24 గంటల్లో విధుల్లో చేరకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేస్తామని చివరగా ఇద్దరి డిగ్రీలు క్యాన్సిల్ చేస్తామని కూడా తీవ్రంగా హెచ్చరించారు. దాంతో దంపతులు దిగొచ్చారు. వైరస్ సమస్య తగ్గిన నెల తర్వాత  తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తామంటూ ఇపుడు చెబుతున్నారు. ఏదేమైనా డాక్టర్ రాజీనామల అంశం సంచలనంగా మారింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: