కరోనా వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు దేశం లో లాక్ డౌన్ ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రజలు కూడా ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. చాలా వరకు అందరూ ఇళ్ళల్లోనే ఉంటున్నారు. లాక్ డౌన్ 21 రోజులు అని చెప్పడం వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ మానేసి ఇళ్ళల్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 700 కి దగ్గరలో ఉంది. వీరిలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో లాక్ డౌన్ ని మరింత కఠినం గా అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 

 

అది పక్కన పెడితే ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇష్టం వాచినట్టు లాఠీ లు పట్టుకుని కొడుతున్నారు. గ్రామాల్లో కక్ష సాధించినట్టు కొడుతున్నారు. ఒక్కొక్కరు రోడ్డు మీద ఉన్నా చిన్న అవసరాల కోసం బయటకు వచ్చినా సరే కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. నగర ప్రాంతాల్లో కూడా రోడ్ల మీదకు వచ్చిన వాళ్ళను అనవసరంగా కొడుతున్నారు. చిన్న చిన్న నిత్యావసరాల కోసం వచ్చినా సరే ఎవరూ మాట వినే పరిస్థితి కనపడటం లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టడంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. కోర్ట్ కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు కొందరు. 

 

కర్నూలు జిల్లాలో లాఠీ దెబ్బలకు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరోనా చావు కంటే లాఠీ చావు ముందు వస్తుంది. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసులపై కోర్ట్ కి వెళ్ళాలి అని కొన్ని రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఏ హక్కు తో కొడుతున్నారు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దెబ్బ రెండు దెబ్బలతో సరిపెట్టాలి గాని ఇలా కొట్టడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: