దేశంలోనే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ప్రపంచమంతటా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న తరుణంలో చాలా దేశాలలో లాక్ డౌన్ ఆయా ప్రభుత్వాలు అమలులోకి తీసుకు రావడం జరిగింది. ఇటువంటి తరుణంలో బాబోరు కి సంబంధించిన మీడియా ఛానల్ నెదర్లాండ్ దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయడానికి చంద్రబాబు రంగంలోకి దిగాబోతున్నట్లు వార్తలు ప్రసారం చేయటం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. వైరస్ వ్యాపించకుండా ఎలా డీల్ చేయాలో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో నెదర్లాండ్ ప్రధాని ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఆహ్వానించడం జరిగిందట.

 

దీంతో ప్రపంచ వ్యాప్తంగా నెదర్లాండ్స్ ప్రధాని వ్యవహారం హైలెట్ అయ్యాక ఇప్పుడు దేశంలోనూ అదే జరుగుతోంది అని ఆ మీడియా సరికొత్త కథనం ప్రసారం చేసింది. ఇంకేం చెప్పిందంటే నోట్ల రద్దు సంక్షోభాన్ని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నేతృత్వంలో ఒక కమిటీని వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు అదే స్ఫూర్తితో కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ వేస్తే మంచి రిజల్ట్ వస్తుందని చర్చ ఢిల్లీలో జరుగుతుందట. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు కాబట్టి ప్రస్తుతం దేశానికి చంద్రబాబు అవసరం ఎంతో ఉందని ప్రధాని మోడీ తన సహచర నాయకులతో అన్నారట.

 

ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నేతలు కూడా చంద్రబాబును ఈ టైంలో ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆ మీడియా చానల్ కథనం ప్రసారం చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో నెటిజనులు చంద్రబాబు హైదరాబాదులో ఉన్నారు...ముందు హైదరాబాదులో వైరస్ వ్యాపించకుండా తన అనుభవాన్ని సేవలను అందించాలని కోరుతున్నారు. మరోపక్క వైసీపీ కార్యకర్తలు ఈ వార్త విని జోక్ అదిరిపోయింది అంటూ ఎటకారంగా కామెంట్లు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: