ఇన్ని రోజులు ప్రపంచ దేశాలు అన్నింటినీ విపరీతంగా వణికించిన కరోనా వైరస్ బెడద నుంచి మానవాళిని విముక్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ వైరస్ దెబ్బకు అతలాకుతలమైన దేశాలన్నీ త్వరలోనే గాడిన పడినట్లే. ఇన్ని రోజులు ఇళ్లల్లో కరుణా దెబ్బకు భయపడిన జనాలంతా ఇకపై బయటికి వచ్చి హాయిగా ఎటువంటి రుమాలు మరియు మాస్కులు లేకుండా స్వేచ్ఛా వాయువులు పీల్చవచ్చు. దాదాపు మూడు నెలలుగా ప్రజలను పీడిస్తున్న కరోనా మహమ్మారి ఆటను అరికట్టేందుకు వ్యాక్సిన్ తయారైపోయింది.

 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం బయో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ యొక్క ప్రొఫెసర్ డాక్టర్ సీమా మిశ్రా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు టి-సెల్ ఎపీటోప్స్ అనబడే సంభావ్య వ్యాక్సిన్ ను కనిపెట్టేశారు. వైరస్ కు సంబంధించిన అన్ని నిర్మాణాత్మక మరియు అనిర్మాణ ప్రోటీన్ల పై ప్రయోగాత్మక పరీక్షలు జరపగా అందులో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను సమర్థంగా ఎదుర్కొంటుందని అంచనా వేస్తున్నారు.

 

ఈ వ్యాక్సి మనిషిలోని రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా డా. సీమా మిశ్రా డిజైన్ చేసిన సంభావ్య ఎపీటోప్స్ తో జనాభా మొత్తం ఒకేసారి వ్యాక్సిన్ ను ఉపయోగించవచ్చు. సాధారణంగా వ్యాక్సిన్ కనుక్కునేందుకు కనీసం ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది కానీ ఇప్పుడు ఉన్న మేటీ గణాంక పరికరాల ద్వారా వ్యాక్సిన్ కు సంబంధించిన పదార్థాలను కనుగొనడం సాధ్యమైంది.

 

ఇకపోతే యూనివర్సిటీ వారు ఈ వ్యాక్సిన్ కచ్చితంగా కరోనా వైరస్ ను ఎదుర్కొంటుంది అని 100% నమ్మకంతో ఉండగా.. ఇకపై దీని రీసెర్చ్ ను చివరి మెట్టుకి కొనసాగించాల్సి ఉండగా.. దీనికి పర్మిషన్ వచ్చేందుకు కొద్దిగా సమయం పడుతుంది. ఈ వ్యాక్సిన్ ను మనుషుల్లో ప్రయోగించి టెస్ట్ చేసి చూసి దాని వల్ల జరిగే రియాక్షన్ లను నమోదు చేసుకుని దీనికి ఆమోదం ఇవ్వాల్సి ఉండగా అంతా మంచే జరుగుతుందని యూనివర్సిటీ వారు భరోసా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: