లాక్ డౌన్ ప్రకటించారు… ఆర్ధిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఈ పరిణామం ఎంతో ఆశ్చర్యం. కరోనా కట్టడి కావాలి అంటే జనం బయట తిరిగితే మాత్రం అది ఏ విధంగా చూసినా సాధ్యం కాదు. కాబట్టి కరోనా కట్టడి విషయంలో ఈ నిర్ణయం మినహా మరో లాభం లేదు అనే అంగీకారానికి వచ్చారు. ఇప్పుడు అది ఏమో కుటుంబాల నుంచి మరో కుటుంబానికి సోకుతుంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి ఇది సోకుతుంది అని నిర్ధారణ అయింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఇది మరీ విస్తరిస్తుంది. 

 

అయితే కరోనా కట్టడి విషయంలో ప్రజల సహకారం ఇప్పుడు ప్రభుత్వాలకు చాలా తక్కువ గా ఉంది. ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎవరూ కూడా వినడం లేదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారు. ఒక పక్క అన్ని దేశాలు దాన్ని సీరియస్ గా తీసుకుని చర్యలు చేపడుతున్నా సరే మన దేశంలో మాత్రం దాన్ని ఒక కామెడి గా చూస్తున్నారు జనాలు. ఇప్పుడు అది కట్టడి కావాలి అంటే జనాలను పూర్తిగా ఇళ్లకే పరమితం చేయడం మినహా లాభం లేదు. గ్రామ స్థాయిలో అది విస్తరిస్తే మాత్రం కట్టడి చేయడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు. 

 

మందు అందుబాటులోకి వచ్చినా సరే అది కట్టడి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మందు కోసం చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. అది వచ్చినా సరే పేదలకు దొరికే అవకాశాలు చాల తక్కువ. దీనితోనే ఇప్పుడు కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చెయ్యాలని కేంద్రం భావిస్తుంది. ఇళ్లకే సరుకులను పంపాలని జనం బయటకు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తుంది. కనీసం పక్క ఇంటి వాళ్ళతో కూడా మాట్లాడాలని ప్రజలకు మోడీ చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: