కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసి వేయాలని, జిల్లాల సరిహద్దులను కూడా మూసి వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాసేపటి క్రితం కేంద్రం హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలకు రాష్ట్రాలకు నిత్యావసర సరుకులను మాత్రమే తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. 

 

కేవలం నిత్యావసర సరుకులు మాత్రమే అనుమతి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కొత్తగా వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ లో ఉంచాలని అని స్పష్టం చేసింది. నిభంధనలను కతినంగా అమలు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. విద్యార్ధులు, కార్మికులు, ఉద్యోగులను ఇల్లు ఖాళీ చెయ్యాలని ఆదేశిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 

 

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశంలో కరోనా కేసులు ఇప్పుడు వెయ్యికి చేరుకున్నాయి. రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: