ప్రపంచాన్ని ఏలుబడి చెయ్యాలని అనుకుంటుందేమో తెలియదుగా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రపంచంలో అందరికీ అనుమానాన్ని కలిగిస్తోంది. విషయంలోకి వెళితే ఇటీవల కరోనా వైరస్ పుట్టినిల్లు వ్యూహాన్ నగరంలో లాక్ డౌన్ ఎత్తి వేసినట్లు తొలిసారిగా చైనా ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది. ప్రపంచ దేశాలు అంతా ఇప్పుడు చైనా చేసిన ప్రకటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కావాలనే వైరస్ 2019 ఏడాది చివర్లోనే పరిస్థితి ప్రమాదకర సమయంలోనే పట్టణంలో ఉండగా ప్రపంచాన్ని అలర్ట్ చేయకుండా కావాలని చైనా వ్యవహరించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది అంతర్జాతీయ స్థాయిలో.

 

 

ప్రస్తుతం ప్రపంచ దేశాలు, ఆర్ధికంగా బలంగా ఉండే దేశాలు చాలావరకు ఈ వైరస్ వల్ల ఆర్థికంగా కుదేలు కావడంతో, అటువంటి సమయంలో వ్యూహాన్ నగరంలో చైనా ప్రభుత్వం ఆర్థిక సమావేశాలకు అంతా రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కొంతమంది చైనా దేశంలో పెట్టుబడులు పెట్టాలని, చాలా వరకు యూరప్ దేశాలలో అంతా దెబ్బతినటంతో ఇంటర్నేషనల్ ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నట్లు వైరల్ వార్తలు వస్తున్నాయి.

 

 

దీంతో ఇదంతా కుట్రపూరితంగా చైనా వ్యవహరించిందని, ముఖ్యంగా ఈ వైరస్ ఆర్థికంగా బలమైన యూరోప్ కంట్రీ లలో వాతావరణం కి లొంగే ప్రసక్తి లేకపోవటంతో ప్రస్తుతం యూరప్ దేశాలలో ఆర్థిక వ్యవస్థ నిలబడాలంటే చాలా టైం పడుతుంది అని...కాబట్టి ఈ టైంలో ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేవిధంగా చైనా ఈ వైరస్ ని సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ప్రపంచాన్ని మోసం చేసిన దేశం అయినా చైనా మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టేవారు...రాక్షసుడు నోటిలో రక్తం పోసిన వాళ్లు అవుతారని ప్రపంచ ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా దేశాన్ని నమ్మవద్దు అంటూ అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: