కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు మన దేశంలో తీవ్రంగానే ఉంది. నిదానంగా మన దేశంలో పలు రాష్ట్రాల్లో బాధితులు బయటపడుతున్నారు. ఒక్కొక్కరు కరోనా తో మరణిస్తున్నారు. ఎక్కడిక్కడ ఎన్ని చర్యలు చేపట్టినా సరే బాధితుల సంఖ్యా మాత్రం ఆగే పరిస్థితి కనపడటం లేదు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణా ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా బయటపడుతున్నాయి. 

 

అయితే ఇప్పుడు మన దేశంలో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని రాబోయే రెండు మూడు వారాల్లో కరోనా కేసులు బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మన దేశంలో కరోనాను ముందు చాలా తక్కువగా అంచనా వేసారని, అది ఇప్పుడు విశ్వ రూపం చూపించడానికి సిద్దంగా ఉందని అంటున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం అనేది తక్కువగానే ఉన్నా సరే, అది క్రమంగా విస్తరిస్తే మాత్రం తట్టుకోవడం చాలా కష్టమని, 

 

కాబట్టి వైద్య సదుపాయాలను మరింతగా పెంచాలని, పలు భవనాలను ప్రత్యేకంగా అద్దెకు తీసుకుని, ఆ తర్వాత ఆస్పత్రులుగా క్వారంటైన్ సెంటర్లు గా మార్చాలని పలువురు కోరుతున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే మాత్రం ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటే మినహా లాభం లేదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. మన దేశంలో ఒక్కసారి గ్రామ స్థాయిలో విస్తరిస్తే మాత్రం దాన్ని అదుపు చేయడం ప్రభుత్వాలకు సాధ్యం ఏ విధంగానూ కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మహారాష్ట్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: