దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన ఓ మ‌త‌స్తుల కీల‌క స‌మావేశం, అందులో కొంద‌రికి క‌రోనా సోకిన‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గ‌డం, ప‌లు రాష్ట్రాల్లో కొంద‌రు మ‌ర‌ణించ‌డం, మ‌రికొన్ని రాష్ట్రాల్లో వ్యాధి బారిన ఉదంతాలు తెర‌మీద‌కు రావ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై సోష‌ల్ మీడియాలో అయితే...పెద్ద ఎత్తున్నే జ‌చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, దీనిపై స‌ద‌రు నిర్వాహ‌కుల‌ వైఖ‌రి ఏంట‌నేది తాజాగా వెల్ల‌డైంది.

 

దాదాపు వందేళ్లుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని,  తబ్లీక్ జమాత్ కు చెందిన అంతర్జాతీయ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ అని మర్కజ్ నిజాముద్దీన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.  3 నుంచి 5 రోజులు ఉండే ఈ కార్యక్రమాల తేదీలు ఏడాది ముందే ఖరారవుతాయని తెలిపింది. ``దేశ విదేశీ యాత్రికుల సౌలభ్యం దృష్ట్యా తేదీల ఖరారు చేస్తాం. అయితే, ఈ ఏడాది జనతా కర్ప్యూ ప్రకటించగానే రైళ్లు రద్దు కావడంతో కార్యక్రమం నిలిపివేశాం. రైళ్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో 22న చాలామంది ఢిల్లీలో చిక్కుకున్నారు. 22న రాత్రి 9 గంటల వరకూ జనతాకర్ఫ్యూ దృష్ట్యా ఎవరూ బయటికి రాలేదు. ఆ తర్వాత స్వస్ధలాలకు వెళ్తామన్నా చాలా మందికి సాధ్యం కాలేదు` అని ఆ ప్ర‌క‌ట‌న పేర్కొంది.

 


జనతా కర్ఫ్యూ ఎత్తేయగానే ఢిల్లీ ప్రభుత్వం 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించిందని, దీంతో ఎవరికి తోచిన మార్గాల్లో స్వస్ధలాలకు బయలుదేరారని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ``23న కేంద్రం ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ పొడిగించడంతో మరిన్ని సమస్యలు వ‌చ్చాయి. లాక్ డౌన్ పొడిగింపుతో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఢిల్లీలోనే వారిని ఉంచాం. 24న లాక్ డౌన్ నేపథ్యంలో మర్కజ్ మూసేయాలని ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 24వ తేదీన‌ ప్రభుత్వం నుంచి 17 వాహనాల పాస్ లు తీసుకుని కొందరు వెళ్లిపోయారు. మిగిలిన కొందరికి ఢిల్లీ ప్రభుత్వం ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించింది. 28న ఢిల్లీ పోలీసులు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన పేరుతో నోటీసులు ఇచ్చారు. కానీ స్ధానిక అధికారులతో తమ సంప్రదింపుల వివరాలతో సమాధానం ఇచ్చాం. 29న సోషల్ మీడియా పుకార్లతో కేజ్రివాల్ మర్కజ్ పెద్దలపై చర్యలకు ఆదేశించారు. లాక్ డౌన్ సందర్భంగా మర్కజ్ లో చిక్కుకున్న వారిని ఇళ్లకు పంపేందుకే ప్రయత్నించాం. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా ఫలించకపోవడంతో మర్కజ్ లో జనం ఉండిపోయారు. కేజ్రీవాల్ కార్యాలయం వాస్తవాలను నిర్ధారించుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ మొత్తం ఎపిసోడ్ లో మేం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు` అని స్ప‌ష్టం చేశారు. కాగా, ప్రభుత్వం మర్కజ్‌ను క్వారంటైన్ లేదా ఆస్పత్రిగా మార్చుకోవచ్చున‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: