కరోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19 ప్ర‌స్తుతం ప్రపంచాన్ని కబళిస్తోంది. చైనాలో మొదలైన ఈ మ‌హ‌మ్మారి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలకు పాకింది. చైనాలో పరిస్థితి అదుపులోకి వచ్చినా.. అమెరికా, ఇటలీలలో మాత్రం కరోనా విళయతాండవం ఆడుతోంది. ముఖ్యంగా అమెరికా క‌రోనా దెబ్బ‌కు అబ్బా అంటుంది. వైరస్ సోకిన వారితో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అమెరికాలో కరోనా వైరస్‌  బారినపడి మృతిచెందిన వారి సంఖ్య ఐదు వేల‌కు చేరింది. ఆధునిక అమెరికా చరిత్రలోనే ఘోర విషాదాన్ని నింపిన 9/11 దాడులను మించిపోయింది. 

 

ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే 1,550 మందికి పైగా మృత్యువాతపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వచ్చే రెండు వారాలు మరింత దుర్భరంగా ఉండనున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజలను హెచ్చరించారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ కరోనా కేసులు నమోదవుతున్న తీరు చూస్తుంటే.. ట్రంప్ చెప్పిన‌ట్టు మ‌రో రెండు వారాల్లో 5 ల‌క్ష‌లు కేసులు న‌మోదు అవుతాయి అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్ప‌టికే ఇక్క‌డ 2.15 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.

 

అమెరికాలో జనవరి 20న మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. తర్వాత 70 రోజుల వ్యవధిలోనే ఆ దేశం.. ప్రపంచంలోకెల్లా మోస్ట్ ఎఫెక్టెడ్ గా మారిపోయింది. ఇక మిగతా దేశాలతో పోల్చుకుంటే వ్యాధి రికవరీ రేటు చాలా తక్కువగా ఉందక్కడ. పైగా, క్రిటకల్, యాక్టివ్ కేసులు కూడా భారీగా ఉన్నాయి. పరిస్థితి ఇదేరకంగా కొనసాగితే దేశవ్యాప్తంగా కనీసం 1లక్ష మంది నుంచి గరిష్టంగా 2.2 లక్షల మంది చనిపోతారని, ఆ సంఖ్య 2.4 లక్షలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని వైట్ హౌజ్ డాక్టర్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. మ‌రి ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో  డొనాల్డ్‌ ట్రంప్ క‌రోనాని ఎలా క‌ట్ట‌డి చేస్తారో చూడాలి. కాగా, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8.60 లక్షలు దాటింది. 42 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: