క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. పేరు వింటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే కోవిడ్ భారిన పడిన వారి సంఖ్య 10 లక్షలకు చేర‌గా.. 51,000 మందికి పైగా మరణించారు. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధించి, ప్రజలను గడప దాటి రాకుండా చేశాయి. ఈ క్ర‌మంలోనే సగం దేశాల్లో లాక్‌డౌన్‌ అమలవుతుండగా.. 350 కోట్ల మంది ప్రజల నిర్బంధంలోనే కొనసాగుతున్నారు. కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలకు కూడా వెనుకాడటం లేదు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతూనే వ‌స్తోంది.

 

మరోవైపు భారత్‌లోనూ కోవిడ్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. క‌రోనా దెబ్బ‌కు చూయింగ్ గమ్స్ బంద్ చేశారు. అదేంటి..? క‌రోనా వైర‌స్‌కు.. చూయింగ్ గ‌మ్స్‌కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హర్యానా ప్రభుత్వం చూయింగ్ గమ్‌పై మూడు నెలల నిషేధం విధించింది. వాటి అమ్మకాలు, వినియోగం జరగకూడదని ప్రభుత్వం సూచించింది. వాటిని తిని నోట్లోంచి కింద పడేస్తోన్న సమయంలో, పడేశాక వాటి ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్న‌ట్టు వెల్ల‌డించింది.

 

కాగా,  హర్యానాలో దాదాపు 13, 000 మంది కరోనా అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచామని అక్కడి అధికారులు తెలిపారు. హర్యానాలో గత ఏడాది సెప్టెంబరులో గుట్కా, పాన్ మసాలా వంటి వాటిపై కూడా ఏడాది పాటు నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీటి నిషేధాన్ని కూడా తు.చ. తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వం అధికారులకు మరోసారి సూచనలు జారీ చేసింది. ఇక కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూల రూపంలో సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కాబ‌ట్టి, ఇప్పటికైనా కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించండి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: