ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య  క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ నిజాముద్దీన్‌, మ‌ర్క‌జ్ ఉద‌తంతో  ప్ర‌శాంతత పూర్తిగా చెదిరింది.  ఐదు రోజుల వ్య‌వ‌ధిలోనే క‌రోనా కేసులు ఒక్క‌టొక్క‌టిగా 32కు చేర‌డం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన అధికారులు త‌బ్లిగీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లొచ్చిన ఉమ్మ‌డి ఆరు జిల్లాలోని వ్య‌క్తులు, కుటుంబ స‌భ్యుల‌తోపాటు, బంధువుల‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఇప్ప‌టికే 814 మందికి 14 రోజుల క్వారంటైన్ పూర్త‌యింది. ఇంకా 246 మందిని ప్ర‌భుత్వ క్వారంటైన్‌లోనే ఉంచారు. ఎం జీఎంలోని ఐసోలేష‌న్ వార్డులో  11మంది అనుమానితులకు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.  వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న ప‌లు ప్రాంతాల‌ను అధికారులు గుర్తించారు. దీంతో వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌ల్లో మొత్తం 12 హాట్ స్పాట్‌ల‌ను ఏర్పాటు చేశారు. మ‌రోప‌క్క పోలీసులు లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ప్ర‌జ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: