ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. చాలా దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యపడక పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రపంచ దేశాలకు పెద్దన్నగా చెప్పుకుంటున్న అమెరికా సైతం కరోనా కట్టడి చేసే విషయంలో పూర్తిగా విఫలం అయినట్టుగా అక్కడి పరిస్థితులు అర్ధంపడుతున్నాయి. రోజురోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఇతర దేశాలలో తలెత్తిన పరిస్థితి, భారతదేశంలో తలెత్తకుండా ప్రధానమంత్రి మోదీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మార్చి 27వ తేదీ నుంచి లాక్ డౌన్ విధిస్తూ, ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యేలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధన కఠినంగా అమలవుతోంది. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి లాక్ డౌన్ నిబంధన పూర్తిగా ఎత్తివేయాల్సి ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి అనేక విజ్ఞప్తులు అందుతున్నాయి. 

IHG


మరికొంతకాలం ఈ నిబంధనలను పొడిగించాలని, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రాలేదని, రోజురోజుకు కొత్త కేసులు నమోదు అవుతున్నాయని, దీనికి లాక్ డౌన్ మరికొంత కాలం పొడిగించడం ఒక్కటే పరిష్కారం అంటూ కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఆలోచనలో పడింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని సీనియర్ ఐఏఎస్, కలెక్టర్లకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ లు వెళ్లినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని ప్రధాన కార్యాలయం నుంచి అధికారులకు ఫోన్ లు చేసి ఆరా తీస్తున్నారట.  మరికొంతకాలం దీనిని పొడిగిస్తే మంచిదని, అప్పుడు మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి ని పూర్తిగా నిరోధించగల అంటూ అధికారులు ప్రధాన కార్యాలయానికి తెలియజేసినట్లు సమాచారం.

 


 ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం లేకపోలేదని, ఇంకా కొత్త కొత్త కేసులు నమోదు అవుతున్న పరిస్థితుల్లో ఈ నిబంధనలు పూర్తిగా ఎత్తివేస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై కేంద్రం ఆలోచనలో పడినట్లు సమాచారం. లాక్ డౌన్ మరికొంత కాలం పొడిగిస్తే, దేశం ఆర్థికంగా కోలుకోలేని విధంగా చితికిపోతుందని, వ్యాపారులు, సాధారణ ప్రజలకు ఉపాధి ఇలా అనేక అంశాల్లో ప్రజలు ఇబ్బంది పడతారని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

 


 ఢిల్లీ మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే మన దేశంలో పరిస్థితి అదుపు తప్పిందని, ఇప్పటికే కొంతమంది ని గుర్తించి వారిని క్వారంటైన్ కు తరలించినా మరికొంతమంది ఆచూకీ లభించకపోవడంతో కొత్తగా మరి ఎన్ని కేసులు నమోదు అవుతాయో తెలియని పరిస్థితి ఉండడంతో కేంద్రం అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ గా ఒక క్లారిటీ కి రావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: