అనంత‌పురం జిల్లాలో క‌రోనా వైర‌స్ వ్యాప్తికి వైద్యులే కార‌ణ‌మయ్యారా..? వ వాళ్లు ప్ర‌ద‌ర్శించిన నిర్ల‌క్ష్య‌మే ప‌దుల సంఖ్య‌లో రోగుల‌ను, వైద్య సిబ్బందిని క‌రోనా కోర‌ల్లోకి నెట్టేసిన‌ట్ల‌యిందా..? అంటే వైద్య వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. వాస్త‌వానికి కరోనా నివారణకు జిల్లా యంత్రాంగం క్షణం తీరిక లేకుండా పనిచేస్తోంది. అయితే యంత్రాంగంలో కొంత‌మంది చేస్తున్న త‌ప్పిదాల‌తో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా లక్షణాలపై నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్యులే.. దాన్ని లైట్ తీసుకున్నారు.  

 

ఇది హిందూపురం వాసి విషయంలో ప్ర‌స్పుటంగా క‌నిపించింద‌ని కొంత‌మంది ఉన్న‌తాధికారులే చెబుతున్నారు. ఫ‌లితంగా  ఫలితంగా ఆస్పత్రిలోని వైద్యులు, నర్సులు కరోనా బారిన ప‌డ్డార‌ని పేర్కొంటున్నారు. హిందూపురం వాసితో కలిసి వార్డులో ఉన్న కళ్యాణదుర్గం వాసి విషయంలోనూ వైద్యాధికారుల నిర్లక్ష్యం వ‌హించార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి అనుమానిత కేసు అన‌గానే వైద్యులు లైట్ తీసుకోవ‌డంతో పాటు ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇక్క‌డ ఒక్క‌రోజులోనే ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డం గ‌మ‌నార్హం. కరోనా పాజిటివ్‌ కేసులతో అనంతపురం జిల్లావాసులు ఉలిక్కిప‌డ్డారు. ఒకే రోజు ఏడు కేసులు నమోదు కావడం, అందులో ఒకరు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. 

 

ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 13 కేసులు నమోదు కాగా, అందులో ఇద్దరు మృతి చెందారు. కరోనా బారిన పడిన వారిలో సర్వజనాస్పత్రిలో రోగులకు సేవలందించిన ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్‌నర్సులు ఉండటం గ‌మ‌నార్హం. అయితే ఇప్పుడు ఆస్పత్రిలో సేవ‌లందించిన  వైద్యులు, సిబ్బంది భయాందోళన మొద‌లైంది.  పాజిటివ్‌ వచ్చిన వైద్యులు, నర్సులు ఆస్పత్రిలోని వివిధ ప్రాంతాల్లో తిరగడంతో పాటు తోటి సిబ్బంది, నర్సింగ్, వైద్య విద్యార్థులతో పని చేశారు. ఇప్పుడు వారంద‌రి వివ‌రాల‌ను సేక‌రించి క్వారంటైన్‌కు త‌ర‌లించే ప‌నిలో ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నారు.  ఇక ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 40 మందికి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: