భారతదేశంలో విజృంభిస్తున్న కరోనా  వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. యధేచ్చగా కోరలు చాస్తున్న ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగి పోతుంది. ఇప్పటికే 500కు పైగా కరోనా  పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యాయి. అయితే తెలంగాణ సర్కార్  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు కరోనా  కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో... మరిన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తుంది సర్కార్.  అంతేకాకుండా కరోనా  వైరస్ బారిన పడిన వారికి సమర్థవంతంగా చికిత్స అందించేందుకు నిర్ణయించింది కేసీఆర్ సర్కార్. 

 

 

 ఈ క్రమంలోనే గచ్చిబౌలి లో కరోనా  పేషెంట్స్ కోసం ఒక ప్రత్యేక హాస్పిటల్ నిర్మిస్తోంది తెలంగాణ సర్కార్. అయితే గతంలో కరోనా  వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనాలో కరోనా  వైరస్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రోగులకు చికిత్స అందించేందుకు 8 రోజుల్లో  100 పడకల ఆసుపత్రిని కట్టి అందరిని ఆశ్చర్యానికి లోను చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా చైనాలో  కట్టిన పడకల ఆసుపత్రిని 1500 పడకల ఆసుపత్రి కడుతుంది తెలంగాణ ప్రభుత్వం. అది కూడా కేవలం పది రోజుల వ్యవధిలోనే ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. దీని కోసం కార్మికులు రేయింబవళ్ళు పని చేస్తూ హాస్పిటల్ నిర్మాణానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 

 

 

 అత్యాధునిక వైద్య సదుపాయాలతో కరోనా పేషంట్ల  కోసం అతి పెద్ద ఆసుపత్రి సిద్ధం చేస్తోంది తెలంగాణా సర్కార్ . రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిన ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది తెలంగాణ సర్కార్. మొత్తంగా 13 అంతస్తులోకి ఆసుపత్రి  నిర్మాణం జరుగుతుండగా... ప్రతి అంతస్థులో 36 గదులను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం  ఆస్పత్రిలో 468 గదులు ఉండనున్నాయి. 1200 నుంచి 1500 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేయనుండగా...  ఒక్కొక్క పడకకు 6 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పేషెంట్ కి చైర్ లాకర్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఇక ఏప్రిల్ 15 వరకు ఈ ఆసుపత్రిని పూర్తిచేసి ప్రస్తుతం కరోనా వైరస్ రోగులను ఆసుపత్రికి తరలించనున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: