2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వైసీపీ పార్టీ లేకుండా చేయాలని అనేక కుయుక్తులు వేశారు. వాటిలో ఒకటి జగన్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను రాజీనామా చేయించకుండా డైరెక్టుగా తన పార్టీలో చేర్చుకోవడం. అనేక మంది వైసీపీ పార్టీకి చెందిన అప్పట్లో ఉన్న నాయకులను అనేక ఇబ్బందులకు గురి చేసి మరియు ఆఫర్లు ఇచ్చి పదవులు ఎరగా వేసి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు. 2017 వరకు పార్టీ జంపింగ్ జపాంగ్ ల కార్యక్రమం జరిగింది. ఈ విధంగా పార్టీ నుండి వెళ్ళిన కొంతమంది నాయకులకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్ ని అసెంబ్లీలో అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.

 

ఈ పరిణామంతో డైరెక్టుగా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన జగన్...నేరుగా తానేంటో ప్రజా క్షేత్రంలో తేల్చుకోవడానికి ప్రజా సంకల్ప పాదయాత్ర స్టార్ట్ చేసి 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. ఇదిలా ఉండగా గతంలో వైసిపి పార్టీ నుండి టిడిపి లోకి వెళ్లిన నాయకులకు ప్రస్తుతం ఆ పార్టీలో ఆదరణ లేకుండా పోయిందట. చాలా చోట్ల టీడీపీ క్యాడర్ కావాలని ఈ జంపింగ్ జపాంగ్ అభ్యర్థులను పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైసిపి పార్టీ పెద్దలతో వాళ్లు టచ్ లోకి వచ్చి..తిరిగి వైసీపీలోకి వచ్చేస్తాము అని...జగన్ పచ్చజెండా ఊపితే రెడీగా ఉన్నామని అంటున్నారట.

 

ముఖ్యంగా పామ‌ర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్పన , పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వరి వీరంతా జగన్ అవకాశం ఇస్తే పార్టీలోకి వస్తామని ఈ ఉక్కిరి బిక్కిరి రాజకీయాల్లో ఉండలేకపోతున్నాము అని అంటున్నారు. మేము గతంలో పార్టీ ని మోసం చేసి టిడిపిలోకి వెళ్ళటం తప్పే అంటూ...అధ్యక్షుడు జగన్ ని నేరుగా ఎదుర్కొనలేక మీతో మాట్లాడుతున్నాము అంటూ పార్టీ పెద్దలతో మాట్లాడుతూ పార్టీలోకి మళ్లీ రాణిస్తే అదే పదివేలు ఊపిరి పీల్చుకుంటాము అని అంటున్నారట. మరి జగన్ రాణిస్తాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: