కరోనా వైరస్ ఎఫెక్ట్  తో ప్రస్తుతం దేశం మొత్తం అల్లాడుతున్న విషయం తెలిసింది. అయితే కరోనా  వైరస్ కారణంగా ప్రస్తుతం వైద్యసేవలు సరిపోవడం లేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా  వైరస్ కు చికిత్స అందించకపోవడం కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ప్రభుత్వం తరఫున కరోనా కు  వ చికిత్స అందిస్తుండడంతో ... ప్రస్తుతం చాలా మటుకు ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్ల కొరత అనేది కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా త్వరలో ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి రోజులు రాబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది డాక్టర్లకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఎంతోమంది ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం రాక ప్రైవేట్ ఆస్పత్రిలో అతి తక్కువ జీతానికి పని చేస్తూ ఉంటారు. 

 


 ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రమ  దోపిడీ చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఎక్కడ గత్యంతరం లేక ఎంబీబీఎస్ పూర్తి చేసి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నే పని చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా త్వరలో నిరుద్యోగులు కాస్త  ఉద్యోగులు గా మారబోతున్నట్లు  తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు మంచికాలం రాబోతున్నట్లు అర్థమవుతుంది. సంక్షోభం నుంచి ఎంతో మందికి అవకాశం రాబోతూంది . కరోనా వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిని బాగు  చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దానికి అనుకూలమైన ఆరోగ్య ప్యాకేజీని ప్రకటించినది  కేంద్ర ప్రభుత్వం. 

 


 కరోనా  వైరస్ సహా భవిష్యత్తులో వచ్చే మరిన్ని విపత్తులను ఎదుర్కొనేందుకు ఈ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టం ప్రిపేర్  నెస్ కోసం ఈ పాకేజీ ప్రకటించినట్లు  తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రి లో బాగు చేసేందుకు అయ్యే ఖర్చులో వందకి 100% కేంద్ర ప్రభుత్వమే భరించేందుకు నిర్ణయించింది. మూడు దశల్లో ఈ ప్యాకేజీలో చేపట్టాల్సిన అంశాలను కేంద్ర ప్రభుత్వం వివరించింది . జాతీయ రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి.. మార్గదర్శకాలను ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించింది .. 2020 జనవరి నుంచి జూన్ వరకు తొలిదశ ఉండగా... ఇక ఆ తర్వాత జూలై నుంచి.. 2021 మార్చి వరకు రెండవ దశ.. 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ ఇలా మూడు దశలో  నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: