తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది అన్న  విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సహ  వైద్యులు కూడా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా  కేసుల్లో ఎక్కువ మంది బాధితులు గాంధీ ఆస్పత్రిలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్  వార్డులో  చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కరోనా  పేషెంట్లకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు... ముందుగా కరోనా  వైరస్ పేషెంట్లలో ధైర్యాన్ని నింపుతూ వారిని కోలుకునే విధంగా చేస్తున్నారు. అయితే తాజాగా గాంధీ ఆసుపత్రి వైద్యులు మరో కొత్త ట్రీట్మెంట్ ను కరోనా వైరస్ పేషెంట్లు కోసం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అదే ప్లాస్మా ట్రీట్మెంట్. ఒకవేళ ప్రస్తుతం కరుణ వరద బాధితులకు ప్లాస్మా ట్రీట్మెంట్ చేస్తే తొందరగా కోలుకునేందుకు వీలు ఉంటుందనే  ఉద్దేశంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు... ఈ ట్రీట్మెంట్  చేయడానికి రెడీ అవుతున్నారట. 

 

 

 కాగా ఈ ట్రీట్మెంట్ కి  రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 500 పైగా కరోనా  వైరస్ కేసులు నమోదవగా దాదాపుగా మూడు వందల మంది కరోనా వైరస్ పేషెంట్లు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక డాక్టర్లు ఎక్కువగా వారికి చికిత్స అందించడంతో పాటు  వారిలో కాన్ఫరెన్స్ నుంచి కరోనా  ఎదుర్కొనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా  వైరస్ బారి నుంచి ఏకంగా 40 మంది కోలుకున్నారు. అయితే ఈ మహమ్మారి వైరస్ కు వ్యాక్సిన్ తయారవ్వాలంటే చాలా సమయం పడుతుంది అన్న విషయం తెలుసిందే . ఈ క్రమంలో కరోనా  వైరస్ కి విరుగుడు తయారయ్యేంతవరకూ ప్లాస్మా  ట్రీట్మెంట్  అందిస్తే దీన్ని కట్టడి చేయడానికి వీలు ఉంటుందని గాంధీ ఆసుపత్రి వైద్యులు అంటున్నారు. 

 

 

 ఇంతకీ గాంధీ ఆసుపత్రి వైద్యులు కరోనా పేషెంట్లకు అందించేందుకు సిద్ధమవుతున్న ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే ఏమిటి అంటే... ప్రస్తుతం కరోనా  వైరస్ నుంచి కోలుకున్నా వారు  విరుగుడు లేకున్నప్పటికీ ఎలా కోలుకున్నారు అంటే కరోనా  వైరస్ బారిన పడిన వారి బాడీ లోకి ఆంటీబాడీస్ అనే  ఒక రకమైన బ్యాక్టీరియా ని పంపిస్తారు అది మనిషి బాడీ లోకి వెళ్ళిన తర్వాత... క్రమ క్రమంగా బలం పెంచుకునే కరోనా  వైరస్ తో పోరాటం చేసి నశింపజేస్తుంది. దీంతో కరోనా వైరస్ నుండి కోలుకోవడానికి  వీలు ఉంటుంది.  అయితే కరోనా  వైరస్ నుండి కోలుకున్న వారి దగ్గర నుంచి యాంటీబాడీస్ ను  తీసుకుని కరోనా  పేషెంట్లకు ఎక్కిస్తారు. అది బాడీ లోకి వెళ్ళాక సంఖ్యను పెంచుకుంటూ కరొనతో  యుద్ధం చేస్తూ ఉంటుంది. ఇలా ప్లాస్మా  ట్రీట్మెంట్ ద్వారా త్వరగా కరోనా  వైరస్ బారిన పడిన వారిని కోలుకునేలా చేయవచ్చు. అయితే ఇది ఓకే అవ్వాలంటే మాత్రం చాలా తతంగమే ఉంటుంది. ఎంతో మంది అధికారులు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: