అవుని మరి. ఇపుడు దేశ ప్రజలంతా చాలా భయంగా ఉన్నారు. బితుకు బితుకుగా జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా మహమ్మారి ఏ వైపున పొంచి ఉందో ఎవరి నుంచి మరెవరికి సోకుతుందోనని భయపడి చస్తున్నారు. నిజంగా కరోనా కరోడాలా మారి కొరడా ఝలిపిస్తోంది.

 

ఇవన్నీ ఇలా ఉంటే కరోనా విషయంలో ఓ రకమైన శుభకరమైన  మంచి వార్తను పరిశోధకులు, మన శాస్త్రవేత్తలు ముందుకు తెచ్చారు. చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనాకు భారత దేశంలో విస్తరించిన కరోనాకు మధ్య చలా తేడా  ఉందని వారి అధ్యయనంలో తేలిందంట. 

 

చైనాలో మహమ్మారిగా మారింది. అదే దూకుడుతో ఇటలీ, అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కరోనా వీర విహారం చేసి వేలల్లో జనాన్ని  పొట్టన పెట్టుకుంది. అటువంటి కరోనా భారత్ లో ప్రవేశించాక దాని దూకుడు నెమ్మదించిందని అంటున్నారు. భారత దేశంలోకి వచ్చిన కరోనా వైరస్ జన్యువులలో ఎన్నో మార్పులు వచ్చాయని చెబుతున్నారు.

 

అది పూర్తిగా బలహీనమైనదని కూడా గుర్తించారుట. ఈ వైరస్ ప్రభావం అందుకే అంత తీవ్రంగా లేదని చెప్పుకొస్తున్నారు. ఇది ఓ విధంగా కోట్లాడి మంది దేవుళ్ళు, అనేక మతాలు, సంప్రదాయాలతో ఉన్న భారత్ లాంటి ఆస్థిక దేశానికి దేవుడి చూపించిన దయ అనుకోవాలి.

 

లేకపోతే చైనా తో సమానమైన‌ జనాభా కలిగి ఉన్న భారత్ లో ఇంకా తక్కువలోనే కరోనా వైరస్ కేసులు నమోదు అవౌతున్నాయి. అలాగే నమోదు అయిన కేసుల్లో పదవ శాతం రికవరీ అవుతున్నాయి. మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉంది. దీనికి అటు పాలకులు, ఇటు పౌరులు కూడా కలసి తీసుకున్న సమిష్టి క్రుషి నిర్ణయం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు.

 

 

లాక్ డౌన్ సకాలంలో ప్ర‌కటించడం, భయంతో ప్రజలు కూడా ఇంటి పట్టున ఉండడం వంటి కారణాల  వల్ల కరోనా వైరస్ తీవ్రత నుంచి మనం కొంత మేర తప్పించుకున్నాం. రానున్న రోజుల్లో ఇదే విధంగా వ్యవహరిస్తే మన దేశ పొలిమేరల నుంచి కరోనాను తరిమికొట్టవచ్చునన్నది నిజం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: