ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ఒక్కసారిగా రాజకీయాలు సైలెంట్ అయిపోయాయి. చాలా మంది రాజకీయ విమర్శలు చేసూకోకుండా కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయ వేడి అస్సలు తగ్గడం లేదు. లాక్ డౌన్  ప్రకటించడానికి ముందు ఎన్నికల వాయిదా కు  సంబంధించి తీవ్రస్థాయిలో రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు జరగగా... గత కొన్ని రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు కాస్త సద్దుమణిగాయి కానీ ప్రస్తుతం మరోసారి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండగా... అధికార పార్టీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు టిడిపి పార్టీ నేతలు. 

 

 

 దమ్ముంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి  మాట్లాడాలి అంటూ చంద్రబాబుపై  వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న వేల అచ్చం నాయుడు వైసీపీ నేతల పై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా  వైరస్ విజృంభిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్  అమలవుతున్నప్పటికీ స్వార్థ ప్రయోజనాల కోసం లాక్ డౌన్ ఉల్లగిస్తున్నారు ... మీరు మంత్రుల... చంద్రబాబుకు దమ్ముంటే హైదరాబాద్ నుంచి రమ్మంటున్నారు...పాలన  చేతకాకపోతే చెప్పండి భేషరతుగా చంద్రబాబు వచ్చి పాలన  ఏమిటో చూపిస్తాడు అంటూ అచ్చం నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

 

 

 జ్యోతిరావు పూలే ఆశయాలతో ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని.... ఇప్పుడు వరకు రాజ్యాధికారంలో భాగమయ్యే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ లకు కీలక పదవులు కట్టబెట్టింది టిడిపి పార్టీ అంటు,  అచ్చం నాయుడు వ్యాఖ్యానించారు. మేము పాలించిన ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి 46వేల కోట్ల బడ్జెట్ ను ఇచ్చాము .... చేతివృత్తుల వారికి పనిముట్లు,  బీసీ ఫెడరేషన్,  ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశాం అంటూ అచ్చం నాయుడు తెలిపారు.  బీసీలకు టీడీపీ పార్టీకి వెన్నెముకగా నిలిచింది అంటూ వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం అనగారిన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి సర్కారు తీవ్ర అన్యాయం చేస్తోందని... దీనిపై  టిడిపి తప్పక పోరాడుతుంది అంటూ అచ్చన్నాయుడు వ్యాఖ్యానించారు. మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయన జయంతికి మనందరం ఇచ్చే ఘన నివాళి అంటూ అచ్చన్నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: